తాజాగా ప్రకాశం జిల్లాలో పర్వీన్ ట్రావెల్స్‌కి చెందిన ఓ వోల్వోబస్సు కాలి బూడిదైంది. బస్సులో చేయకూడని పదార్ధాలు ఏవో వుండడం వల్లనే మంటలు చెలరేగి అవి క్షణాల్లో దావాణంలా అంతటా వ్యాపించాయని అంటున్నారు ప్రయాణికులు. బుధవారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్దకు టీఎస్ ఏకె 8307 అనే నెంబరు గల వోల్వో బస్సు రాగానే పొగలు రావడం మొదలైంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులను దించివేశాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బస్సులోవున్న ప్రయాణికుల సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఘటనాస్థలికి పోలీసులు ఆలస్యంగా రావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలోవున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: