టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర నారా నందమూరి కుటుంబాలను దగ్గరి చేస్తుందనుకుంటే అటువంటి పరిస్థితి కనిపించటం లేదు..అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపుర్ నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టగా నందమూరి హరికృష్ణ మొదటి రోజు మాత్రమే బాబు పక్కన కనిపించారు...ఆ తరువాత ఏ ఒక్క సందర్భంలో కూడా బాబు పక్కన సీతయ్య కనిపించలేదు. మొదటి రోజు కెమెరాల ముందు సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా వాస్తవానికి చంద్రబాబు పాదయాత్ర మొదలైన అరగంటలోనే హరికృష్ణ మాయమయ్యారు. పరామర్శించని బావమర్ది తరువాత పాదయాత్రలో కాలినొప్పితో బాబు బాధపడినా బావమరిది కనీసం ఫోన్ లో కూడా పరామర్శించలేదు.. ఇదంతా ఒక ఎత్తయితే గద్వాల్ సభలో స్టేజ్ కూలి చంద్రబాబు గాయపడినా హరికృష్ణ మాత్రం స్పందించలేదు. బాబు గాయపడి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కుటుంబసభ్యులందరు బాబుని పరామర్శించారు. నందమూరి కుటుంబంలోని మెజారిటీ కుటుంబసభ్యులు గద్వాల్ వచ్చినప్పటికి హరికృష్ణ మాత్రం బయటికి రావటానికి ఇష్టపడలేదు. హడావుడిగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పటికి పక్కనే షూటింగ్ జరుగుతుందనే వచ్చారని.. ఆయన వస్తున్నట్టు ముందస్తు సమాచారం లేదని లోకేశ్ సన్నిహితులు వ్యాఖ్యానించారు. అలాగే విభేదాలు.. గద్వాలలో లోకేష్ ,జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. నారా నందమూరి కుటుంబాల మద్య విభేదాలు ఇంకా తగ్గలేదని..పాదయాత్ర సమయంలో ఏదో వచ్చాం అన్నట్టుగానే హరికృష్ణ పాల్గొన్నారని బావబావమరుదుల మధ్య ఇంకా గ్యాప్ తగ్గలేదని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలకసమయాల్లో హరికృష్ణ తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారని సీనియర్లు అంటున్నారు. ఇప్పటికైనా విభేదాలు పక్కన పెట్టకపోతే ఇటు పార్టీకి అటు నందమూరి వారసులకు నష్టమే అని ఆ పార్టీ నేతలే అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: