జనసేన అధినేత ఆ మధ్య ఆర్భాటంగా మీడియా ముందుకు వచ్చాడు. తూళ్లూరు వరకూ వెళ్లొచ్చాడు. అక్కడికి రైతులకు నేనున్నానే హామీని ఇచ్చి వచ్చాడు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొంటే సహించేది లేదని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం అలా చేస్తే తను ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని పవన్ గొప్పగా చెప్పుకొన్నాడు.

అయితే అలా ప్రకటించిన ఆ నేత ఆచూకీ ఇప్పటి వరకూ మళ్లీ కనిపించలేదు. తూళ్లూరు వరకూ వెళ్లి వచ్చిన పవన్ మళ్లీ ఆ విషయంలో స్పందించలేదు. అసలు అక్కడ వరకూ వెళ్లొచ్చిన పవన్ అక్కడ భూ సమీకరణ అనేది న్యాయబద్ధంగా జరుగుతోందా? లేదా? అనే అంశం గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం భూ సమీకరణ అంశం గురించి ప్రజలకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తోంది. తాజా గా మంత్రి నారాయణ భూ సమీకరణ అంశం గురించి రైతులకు హెచ్చరిక చేశాడు. ఏప్రిల్ 15 వ తేదీలోగా అందరూ భూములను ప్రభుత్వానికి అప్పగించేయాలని నారాయణ స్పష్టం చేశాడు. ప్రజలే స్వచ్చందంగా భూమలుఇచ్చి ఉంటే.. ఇలా హెచ్చరికలుచేయాల్సిన అవసరం ఏముంది?

మరి ఈ మాటలు ఇప్పుడు పవన్ కల్యాణ్ కు వినిపించడం లేదా? బలవంత భూ సేకరణ వద్దు అని స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడికి నారాయణ హెచ్చరికలు పట్టవా? ప్రభుత్వం కూడా పవన్ కల్యాణ్ ను పట్టించుకోదా?! ఇంతేనా పవన్ కల్యాణ్ రాజకీయం? పోరాటం!

మరింత సమాచారం తెలుసుకోండి: