జులై మాసంలో జరగనున్న తానా మహాసభల సందర్భంగా డెట్రాయిట్ లొ జాతీయ స్థాయిలొ ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. చెస్, క్యారంస్ పోటీలతో ఈ కార్యక్రమాలతో శ్రీ కారం చుట్టడం జరిగింది.        


తానా 20వ మహాసభల సందర్భంగా జాతీయ ఆటల పోటీలు ప్రారంభం

నోవై నగరం లో డెట్రాయిట్  ఇండియన్ సెంటర్ (డైస్) హాల్ లో చెస్, క్యారంస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఉత్సాహభరిత వాతావరణం లో,కోలాహలంగా  సాగిన ఈ ఆటల పోటీలలొ విజయరావు చైర్ పర్సన్ గా, చంద్ర అన్నవరపు, వంశి దేవబత్తుని కోచైర్స్ గా డిటియె స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సుధీర్ బచ్చు, తానా డిటియె సంయుక్త   ఆద్వర్యం లొ ఘనం గా నిర్వహించారు. డిటియె ఆద్వర్యం లొ శ్రీనివాస్ గోనుగుంట్ల,తానా మహాసభల కోర్ కమిటి  సభ్యులు  స్పోర్ట్స్   అడ్వయిజర్ రఘు రావిపాటి  నేత్రుత్వం లొ ఈ పోటీలు  అంచనాల కి మించి జయప్రదంగా నిర్వహింపబడ్డాయి.  


తానా జాతీయ ఆటల పోటీలు


ఈ పోటీలలొ 8 ప్రధాన ఈవెంట్లు  నిర్వహింపబడుతున్నాయి. మొదటి ఈవెంటు గ నిర్వహింపబడిన  చెస్, క్యారంస్ కి అపూర్వ స్పందన లభించాయి. మోహన్ సోమసాగర్,స్వాతి సోమసాగర్, మాధవి గార్ల తొ కలిసి అందించిన ఉపాహారం,మద్యాహ్న భోజన ఏర్పట్ల కు ప్రత్యేక  స్పందన లభించాయి.  


క్యారంస్ విభాగం లొ 64 మంది అమెరికా సంయుక్త


ఈ ఆటల పోటీల లో క్యారంస్ విభాగం లొ 64 మంది అమెరికా సంయుక్త  రాష్ట్రాలలో ప్రధాన నగరాల నుండి మరియు కెనడా నుండి కూడా పాల్గొనటం విశేషం. కొలుంబస్ నుండి పాల్గొన్న ఉమా మునగాల, వేణు ముక్కెర విజేతలు గా నిలిచారు. ద్వితీయ స్థానం లో ట్రయ్ నగరానికి చెందిన ప్రణీతి మెరుగు, జేవియర్ చింతా నిలిచారు. విజేతలకు ట్రోఫీస్ మరియు నగదు బహుమతులు అందచేసారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: