యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు భ‌య‌ప‌డినంత ప‌ని అయ్యింది. గ్రీస్ లోని ఆర్ధిక సంక్షోభ నివార‌ణ కు యూరోజోన్ కూట‌మి దేశాల ఆధ్య‌ర్యంలో యూరోఫియ‌న్ సెంట్ర‌ల్ బ్యాంక్(ఈసీబీ), ఐఎంఎఫ్ లు, మూడో బెయిల్ ఔట్ కు విదించి ష‌ర‌తుల‌కు, నియంత్ర‌ల‌కు ప్ర‌జ‌లు అబిప్రాయ సేక‌ర‌ణ లో నో చెప్పారు. 19 దేశాల యూరోజ‌న్ కూట‌మి, ముఖ్యంగా జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ ఎన్ని అధిరింపులు,బెదిరింపులకు ద‌గినా.. గ్రీస్ ప్ర‌జ‌లు ఆ దేశ ప్రధాని అలెక్సీ సిప్రాస్ పిలుపున‌నుస‌రించి రెఫ‌రెండంలో త‌మ ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌దర్శించారు. త‌మ దేశ ఆర్ధిక ప‌రిస్థితిని ఆస‌రా చేసుకుని ఐఎంఎఫ్, ఈసీబీ చేస్తున్న ఆధిపత్య విధానాల‌కు తెర‌దించారు. ఆర్ధిక  సాయం పేరిట ఐఎంఎఫ్ ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఆర్ధిక కార్య‌క‌లాపాల‌కు ఇది ఒక చెంప పెట్టు.


గ్రీస్ ప్ర‌జ‌ల‌ ప్ర‌ధాన మంత్రి అలెక్సిస్ సిప్రాస్ కే మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌స్తుత ఉన్న ష‌రుతుల‌ను తాము అంగిక‌రిచబోమ‌ని అధికశాతం మంది చెప్పారు. రుణ ధాత‌ల ద‌యా దాక్షిణ్యాల‌పై బ‌త‌క‌డం మాకు ఇష్టం లేద‌ని తేల్చిచెప్పారు. గ్రీసు రిఫ‌రెండం లో  61 శాతం ప్ర‌ధానికి మ‌ద్ద‌తు తెలిపారు. 39 శాతం మంది మాత్రం వ్య‌తిరేకించారు. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి(ఐఎంఎఫ్) లు నిర్ధేశించిన ష‌ర‌తుల‌కు ఒప్పుకొవాలా, వ‌ద్దా అన్న‌ది తేల్చ‌డానికి గ‌త‌ ఆధివారం నిర్వ‌హించిన రిఫ‌రెండం లో అధిక‌శాతం మంది 'నో' అని  నినదించారు. దీంట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా దీనినే స్ఫ‌ష్టం చేశాయి.  ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు రిఫ‌రెండం నిర్వ‌హించారు. అనంత‌రం నాలుగు సంస్థ‌లు ఎగ్జీట్ ఫోల్స్ ను వెలువరించాయి. పెజారీటీ ప్ర‌జ‌లు 'కాదు' అనే జ‌వాబు ఇచ్చారని వెల్ల‌డించాయి.

సంస్కరణలకు నో చెబితే, యూరోజోన్ విచ్ఛిన్నమవుతుందని

Image result for eurozone crisis

ప్రజాభిప్రాయ సేకరణలో సంస్కరణలకు నో చెబితే, యూరోజోన్ విచ్ఛిన్నమవుతుందని, గ్రీస్ యూరో కూటమినుం చి వెలివేయబడుతుందని హెచ్చరించారు. సమష్టి కరెన్సీ రద్దు అయితే గ్రీస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని బెదిరించారు. అప్పు ఎగవేత దారుగా ముద్రపడి ప్రపంచంలో మరెక్కడా అప్పు పుట్టదని హెచ్చరికలు చేశారు అయినా.. గ్రీస్ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణలో నో చెప్పాలన్న ఆ దేశ ప్రధాని సిప్రాస్ పిలుపునకు జై కొట్టారు. అయితే.. ఇలాంటి పరిణామమేదో వస్తుందని యూరోపియన్ దేశాలు గ్రీస్‌లో సిప్రాస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భయపడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ విధానాలకు పట్టుకొమ్మగా చెప్పుకునే యూరప్ దేశాల్లో సిప్రాస్ వామపక్షవాది. ఆయన నాయకత్వం వహిస్తున్న సిరిజా అనేక అభ్యుదయ వర్గాల కలయికతో ఏర్పడిన ఐక్య వేదిక. 

ఐఎంఎఫ్‌కు సిప్రాస్ సింహస్వప్నంగా మారాడ


ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసాయం పేర ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, తన ఆర్థిక శక్తితో దేశాలను ఆటాడిస్తున్న ఐఎంఎఫ్‌కు సిప్రాస్ సింహస్వప్నంగా మారాడనే చెప్పా లి. ఇప్పటికైతే ఓ ఘట్టం ముగిసింది. రెఫరెండం ద్వారా యూరోజోన్ దేశాలు, ఐఎంఎఫ్‌ల ఆధిపత్యాన్ని సవాల్ చేసి గ్రీస్ బరిగీసి నిలిచింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత విర్రవీగుతున్న పెట్టుబడిదారీ విధానం, దాని ఆర్థిక ఆయు ధం ఐఎంఎఫ్‌ల దాష్టీకాలకు గ్రీస్ ప్రజలు ముకుతాడు వేశారు. ఇక ముందు గ్రీస్ అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉన్నది. సరిహద్దుల్లో ఆంక్షలు లేని ఎగుమతులు, దిగుమతులతో నిన్నటి దాకా సాగిన ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. దీన్ని ప్రజల సహకారం, భాగస్వామ్యంతో సిప్రాస్ అధిగమించాలి. పర్యావరణాన్ని పరిరక్షణ గ్రూపు లు, మానవతావాద పక్షాలు, ఫెమినిస్టు వర్గాలు మొదలుకొని అనేక రకాల వామపక్షాలు ఈ పార్టీ లో ఉన్నాయి. 


అనేక గ్రూపులుగా ఉన్న ఈ పార్టీల ను సిప్రాస్ ఏకతాటిపైకి తెచ్చి 2015 జనవరి 27న గ్రీస్‌లో అధికారం చేజిక్కించుకున్నాడు. మొదటినుంచి నియంతృత్వానికీ, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీల ప్రతినిధిగా పేరు న్న సిప్రాస్, ఇప్పుడు ఆర్థిక ఆధిపత్య విధానాలను సవాలు చేయడంతో యూరప్‌లోనే కాదు, అమెరికాలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. యూరోజోన్ కూటమి సమష్టి కరెన్సీ యూరోను ఉపసంహరించుకుంటే.. దేశంలో తలెత్తే పరిణామాలను అంతే దీటుగా ఎదుర్కోవాలి. తన పాత కరెన్సీ డ్రక్మాకు ప్రాణం పోసి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవాలి. ప్రజలను భయబ్రాంతులను చేయడానికి మిగతా యూరోజోన్ దేశాలు అవలంబించే కుట్రలు, కుహకాలను తిప్పికొట్టాలి. ఒక్కటొక్కటిగా మూతపడుతున్న బ్యాంకులను నిలబెట్టుకోవాలి.అయితే గ్రీస్ ప్ర‌దాని అలెక్సీ సిప్రాస్ ఒక్క‌డే దీన్ని సాధించ‌లేడు. ప్ర‌జ‌ల మద్ద‌తు ఉన్నంత వ‌ర‌కు సిప్రాస్ ఒంట‌రి కాదు. గ్రీస్ ను ఏ శ‌క్తి ఓడించ‌లేదు.త‌ర‌త‌రాలు మాన‌వ వికాస చ‌రిత్రలో గ్రీస్ ప్ర‌జ‌ల‌ది వెలుగు దారి. ఆధునిక చ‌రిత్ర లోనూ గుత్తాధిప‌త్యానికీ క‌ళ్లెం వేసే మార్గం చూపిన  గ్రీస్, ఇప్ప‌టి విముక్తి దారి.



మరింత సమాచారం తెలుసుకోండి: