పుష్కరాల్లో ఏడోరోజు వరకు రాజమండ్రిలోనే ఉండి పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చినట్లుగా ఉంది. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు.. ఇన్ని వేల మంది అనేక ప్రాంతాలనుంచి తరలి వస్తున్నప్పుడు.. ఇంత గొప్ప సందర్భాన్ని మనం రాజకీయ మైలేజీ కోసం వాడుకోకపోతే ఎలా? అని మధనం మొదలైనట్లున్నది. అందుకే ఆయన ఆరురోజులు గడచిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వీలైనంత పెద్దసంఖ్యలో వచ్చి.. పుష్కరాల ప్రాంతాల్లో సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని, భక్తులకు తోడ్పాటు అందించాలని ఆయన సందేశం ఇచ్చారు. 


పుష్కరాల్లో చంద్రబాబునాయుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నారు. పుష్కరాలకు ఇతర ప్రాంతాలనుంచి తరలివచ్చే భక్తులకు రాజమండ్రి నగర వాసులు చేతనైనంత సాయం చేయాలని.. ఇంటి ముంగిట వెళ్లే వారికి గ్లాసు నీళ్లు ఇచ్చినా చాలునని ఆయన పిలుపు ఇచ్చారు. దీనికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి వీధుల్లో ప్రతి ఇంటి ఎదుటా.. ఎంతో కొంత మేరకు నీళ్లు, మజ్జిగ, అన్నం పొట్లాలు ఇస్తూ స్థానికులు ఎంతో సేవ చేస్తున్నారు. ఈ పిలుపు సక్సెస్‌ అయింది. 


ఇదే సూత్రాన్ని పార్టీకి మైలేజీ మరియు మంచి పేరు కోసం వాడుకోవాలని చంద్రబాబుకు అయిడియా వచ్చేసినట్లుంది. అందుకే పుష్కరాల్లో వచ్చి వాలంటీర్లుగా భక్తులకు సేవలు అందించాలంటూ.. పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపుఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉండే వారైనా.. పార్టీ దుస్తులు ధరించి.. భక్తులకు సేవలు అందించాలని ఆయన చెప్పారు. 
మొత్తానికి పుష్కర దుర్ఘటనల తాలూకు భీతి మొత్తం పోయినట్లున్నది. ఇప్పుడిక పుష్కరాలనుంచి ముందు రాజకీయ మైలేజీ ఆ తరువాత తన వ్యక్తిగత కీర్తి మైలేజీ వంటివి ఎలా సాధించుకోవాలనే దాని మీద చంద్రబాబు దృష్టి పెడుతున్నట్లున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: