. ఉప ఎన్నికలలో పరాజయం నేపథ్యంలో పార్టీకి జవసత్వాలు నింపడం అవసరమని ఈ కమిటీ అభిప్రాయపడింది. స్థానిక సంస్థల, పంచాయతీ ఎన్నికల కోసం ఎలా సమాయత్తం అవ్వాలనే విషయమై మంత్రులు చర్చించారు. మంత్రి తోట నరసింహ ఇంట్లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు,. ఎన్.రఘ వీరారెడ్డి, సి.రామచంద్రయ్య, ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, బసవరజు సారయ్య, విశ్వరూప్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికసంస్థల పటిష్ఠత కోసం ప్రభుత్వం ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే.. నామినేటెడ్ పదవుల భర్తీ ద్వారా రానున్న ఎన్నికలకు సిద్దం కావచ్చనే విషయమై దాదాపు అందరు మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపుపై ప్రస్తావన వచ్చింది. కేవలం సానుభూతితోనే వైకాపా గెలిచిందని కొందరు అన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను తగిన వారికివ్వాలనే అభిప్రాయం వ్యక్తంమైంది. ఇదే విషయమై ఫ్రభుత్వానికి సిఫారుసు చేయాలని ఈ కమిటీ భావిస్తోంది. 14 లేదా 15 తేదీలలో మరొకసారి భేటీ అయిన తర్వాత ప్రభుత్వానికి 16వ నివేదిక సమర్పించాలని కమిటీ భావిస్తోంది. ఇటీవల ఉప ఎన్నికలలో ఓడిపోయిన నాయకులకు ఈ పదవులను కట్టబెడిలతే బాగుంటుందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. దీనివల్ల ఆ నాయకుల సేవలు స్థానిక నియోజకవర్గాలలో ఉపకరిస్తాయని అంటున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడం అవసరమని కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఇందుకు ఆయా జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం పెంచాలని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: