''ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చెయ్యడంలో మాత్రం ఓడిపోవద్దు'' ఈ మాట మనం తరచూ వింటుంటాం. అలాంటి ఈ మాటను ఎవరు చెప్పారో తెలుసా ? ఎందుకు చెప్పారో తెలుసా ? ఎవరో కాదు ఎందుకో కాదు.. చెప్పింది రవీంద్ర ఠాగూర్.. మన కోసమే ఈ మాట. అది ఎందుకు అనేది ఇప్పుడు ఇక్కడ చదువుదాం. 

 

కొంతమంది వ్యక్తులు.. వారికీ ఆ పని సాధ్యం అవుతుంది. కానీ అది చెయ్యరు. మనవల్ల ఎం అవుతుందిలే అని ఒక భయం. అది మనం చేసిన అవ్వదులే అని ఒక ధీమా.. ఎం చేస్తాంలే ఎలాగో సాధించలేం కదా అనే భయం. ఇలా ఏదైనా అవ్వచ్చు.. అసలు ప్రయత్నమే చెయ్యకుండా ఓడిపోతాము అని నిర్ణయించేసుకుంటారు. అసలు ప్రయత్నం చేస్తే కదా.. గెలిచేది.. ఓడేది తెలిసేది. 

 

ఇందుకు ఒక ఉదాహరణ మీ కోసం.. ''7వ తరగతి చదివే విద్యార్థికి చదువు అస్సలు బుర్రకు ఎక్కడం లేదు.. ఎంత చదివిన అప్పుడు గుర్తు ఉంటాయి.. మళ్ళి గుర్తు ఉండవు. దీంతో ఆ విద్యార్థి నేను ఫెయిల్ అవుతాను.. అవమాన పడాల్సి వస్తుంది అని పరీక్ష రాయాలనే ప్రయత్నం కూడా చెయ్యకుండా చదువు మానేశాడు.. కానీ అదే తరగతిలో చదివే మరో విద్యార్థి అస్సలు ఏమి చదవడు.. ఆ అంటే ఊ రాదు.. ఈ అంటే ఆ రాదు. కానీ ఆ విద్యార్థి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఎందుకు ? అతను ప్రయత్నం చేశాడు.. పక్క పిల్లలు.. ఉపాధ్యాయులు సాయం చేశారు. అందుకే పాస్ అయ్యాడు. కష్టపడే తత్త్వం ఉన్న పిల్లడు దైర్యం లేక, అవమానానికి భయపడి ప్రయత్నం చెయ్యలేదు. చదువు ఆగిపోయింది.'' అందుకే ఏ పనికి అయినా ఖచ్చితంగా ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం.        

మరింత సమాచారం తెలుసుకోండి: