అమ్మ మనకు ఎంతో ప్రేమగా ఉదయమే లేచి వంట చేసిపెట్టి పోతుంది. అలాంటి కమ్మనైన వంట తినాలని.. అది దొరకక బాధపడుతూ ఎంతోమంది ఉంటారు. కానీ కొందరు మాత్రం దానికి రివర్స్. అమ్మ ఎంత కమ్మగా వండిపెట్టిన సరే భోజనం బాలేదు అని భోజనం ఉన్న కంచంలోనే చెయ్యి కడిగేస్తుంటారు. అలా అమ్మ చేసిన వంట అనే కాదు.. ఎవరు చేసిన వంట అయినా సరే భోజనం బాలేదు అని మొహం మీద చెప్పేస్తారు..పస్తులు ఉంటారు. 

 

ఆలా చెప్పేముందు ఒకసారైనా ఆలోచించారా.. మీరు వద్దన్న భోజనం దొరకక ఎంతోమంది ఆకలితో నిద్రపోతున్నారు అన్న సంగతి మీకు తెలుసా ? ఇంట్లో అమ్మ, భార్య ఎంతో కష్టపడి మీకోసం భోజనం తయారు చేస్తే.. భోజనం రుచిగా లేదు అని అంటారు. అలా భోజనం రుచిగా లేదనే ముందు, తినటానికి ఏమీలేని నిరుపేదల గురించి ఒకసారైనా ఆలోచించు. 

 

మనం తినటానికి ఉండి కూడా ఆకలితో నిద్రపోతున్నాం. ఎంతోమంది తినటానికి లేక ఆకలితో మరణిస్తున్నారు. ఆకలి కేకలు ఇప్పటికి భారత్ లో ఆగటం లేదు. ఎక్కడిక్కక్కడ ఈ ఆకలి కేకలతో ఎంతోమంది పసిపిల్లల నుండి వృద్ధుల వరుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి ఆకలి కేకలు ఉన్న మన దేశంలో మనం అన్నం రుచిగా లేదని తినకుండా ఆకలితో ఉంటున్నాం. అందుకే.. భోజనం రుచిగా లేదనే ముందు ఒక్కసారి ఆలోచించండి.. తినటానికి ఏమీలేని నిరుపేదల ఎంతో మంది ఉన్నారని. 

మరింత సమాచారం తెలుసుకోండి: