నేటి మంచిమాట.. ఓడినా మళ్లీ గెలవచ్చు.. కానీ సాకులు వెతకడం మొదలుపెడితే మాత్రం శాశ్వత ఓటమే. అవును.. ఇది అక్షరాలా నిజం.. ఓడితే మళ్లీ గెలవచ్చు.. మళ్లీ మళ్లి ప్రయత్నాలు చెయ్యడం వల్ల మనకు గెలుపు అనేది సాధ్యం అవుతుంది. కానీ ఆలా కాదు అని ఓడిపోడానికి కారణం సాకులు వెతకడం మొదలు పెడితే మాత్రం శాశ్వతంగా ఓటమిని చూడాల్సి వస్తుంది. 

 

ఉదాహరణకు.. మనం ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాం... మనకు ఒక వర్క్ ఇచ్చి ఉంటారు.. అది మనం ప్రయత్నిస్తాం.. చేస్తాము.. కానీ మనం ఆశించిన ఫలితం రాదు.. అప్పుడు ఎం చెయ్యాలి మళ్లీ ప్రయత్నించాలి. మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుపు వస్తుంది. అలా కాదు అని సాకు వెతుక్కుంటే జన్మలో గెలవలేము.. 

 

అందుకే ఓడిపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చెయ్యాలి గెలవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని సాకులు వెతుకుతే మాత్రం ఈ జన్మలో గెలవలేరు .. బద్దకాన్ని వదిలి జీవితంలో ఎలా గెలవాలి అనేది ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు గెలుస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: