భాగస్వామి ని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం మీ వివాహ జీవితానికి చెడుమాత్రమేకాదు. అది మీకు గుండె పోటుకు కూడా దోవతీస్తుందని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో చేసిన పరిశోధనలలో మగవారికి గుండె అనారోగ్యం ఈ రకమైన వివాహేతర నమ్మక ద్రోహాం వలన ఎక్కువ కలుగుతోందని వీరిలో అధిక భాగం తమ భార్యలను మోసగించిన వారేనని పరిశోధనలో వెల్లడైంది. గుండె జబ్బులతో మొదలై అది గుండెపోటుకు దారితీసి మరణాలు సంభవించాయన వీరు తెలిపారు. భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంభోగించటం ప్రత్యేకించి తమకంటే అతి చిన్న వయసుకల యువతులతో సంభోగించటం ప్రమాదకరమని వీరు తెలిపారు. వయసు పైబడి చిన్నవారితో సంభోగిస్తే, అధిక శ్రమ కలిగి రక్తపోటు ఆటుపోట్లకు గురవుతుందని, తక్షణ మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపారు. వయసు అధికం అయిన తర్వాత పురుషుడు తనకు అప్పటివరకు అలవాటు పడిన మహిళ లేదా భార్యతో సంభోగిస్తే, ఈ ప్రమాదం అధికంగా ఉండకపోవచ్చని వారు అభిప్రాయ పడ్డారు. దీనికి కారణంగా రీసెర్చర్లు, సంభోగ సమయంలో పురుషుడిలో కలిగే, తప్పు చేస్తున్నానన్న భావన అతడికి గుండెపోటు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఈ పరిశోధన ఫ్లారెన్స్ యూనివర్శిటీ పరిశోధకులు చేశారు. పురుషుడు తన భార్యతో ఇంటిలో సంభోగించినంతకాలం గుండెపోటు మరణాలు ఉండవని, అతడు ఎపుడైతే, బయటివారితో ప్రత్యేకించి అనుభవం లేని చిన్న వయసు యువతులతో సంభోగానికి తలపడితే, అతడిలో ఏర్పడే తప్పుడు భావనలు అతడిని కుంగదీస్తాయని, శారీరక మార్పులు కూడా అందుకు సహకరించవని వారు తెలిపారు. రతి క్రీడను ఆచరిస్తూ గుండెపోటు కారణంగా చనిపోయిన పురుషుల సంఖ్య సాధారణంగా భార్యతో సంభోగిస్తూ మరణించిన వారికంటే కూడా ఎంతో అధికమని జర్మనీ పరిశోధకులు కూడా తేల్చారు. మూడు వంతుల మరణాలకు కారణం, రక్తనాళాలు ఒక్కపెట్టున చిట్లిపోవటం అని, అప్పటికే కొవ్వు కణాలతో నిండిన రక్తనాళాలు శారీరక ఉద్రేకాలకు తట్టుకోలేక పగిలిపోతున్నాయన్నారు. సాధారణ మరణాల తర్వాత గుండె పోటు మరణాలు ప్రధమ స్ధానం లో ఉన్నట్లు రీసెర్చి తెలిపింది. ఆల్కహాల్ తాగుడు, బాగా తిండితినటం, తనకంటే చిన్నదైన యువతితో సంభోగించటం వంటి కారణాలు ఈ గుండెపోటు మరణాలకు కారణమన్నారు. తన భార్యకంటే చిన్నదైన యువతితో రతి పురుషుడికి ఒత్తిడి అధికం చేస్తుందని అంతేకాక పురుషుడు ఆమెతో తరచుగా రతిచేయకోరతాడని దాని ప్రభావం అతని ఆరోగ్యంపై పడి గుండెపోటుకు దారి తీస్తుందని స్టడీ నిర్వహించిన డాక్టర్లు తెలియజేస్తున్నారు. రహస్యంగా తనకు పరిచయం కాని ప్రదేశంలో ఈ రకమైన ఒత్తిడి కలిగించుకోవటమే మరణాలకు కారణంగా కూడా రీసెర్చర్లు భావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: