పుట్టుకతోనే కొందరిలో యోనిమార్గం లేకుండా పోవడమో. ఒకవేళ ఉన్నా చిన్నిపిల్లల్లోలాగా ఉండిపోవడమో జరుగుతుంది. ఇటువంటి అమ్మాయిలలో గర్భాశయం మామూలుగానే ఉంటుంది. యుక్తవయసు నుంచి బహిష్టులు మొదలవుతాయి. అయినప్పటికీ ఈ బహిష్టుస్రావం నుంచి బయటకు రాకుండా గర్భాశయంలోనే ఉండిపోతుంది. దానికి కారణం బయటకు రావడానికి యోనిమార్గం(వెజైనా) లేకపోవడమే, ఒకవేళ ఉన్నట్టు అనిపించినా అర అంగుళం, అంగుళం లోతు మాత్రమే ఉండి పైకి కనెక్షన్ లేకుండా మూసుకుపోయి ఉంటుంది. ఈ విధంగా యోనిమార్గం చిన్నదిగా వుండటాన్ని వెజైనల్ హైపోప్లేసియా అంటారు. గర్బాశయం ఉండి యోనిమార్గం లేకుండా అయినప్పుడు నెల నెలా తయారయ్యే బహిష్టుస్రావం అక్కడే నిలిచిపోయి కొంతకాలానికి కడుపులాగా పైకి ఎదుగుతుంది. 12 నుండి 15 సంవత్సరాల మధ్య రజస్వల కాకపోతే కారణం ఏదైనదీ పరీక్షచేసి చూడాలి. వైద్య పరీక్షలో యోనిమార్గం వున్నదీ లేనిది, గర్భకోశం ఎలా ఉన్నది తెలస్తుంది. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే కొంత సమాచారం తెలస్తుంది. ప్లాస్టిక్ సర్జరీతో కృత్రిమ యోనిమార్గం:  యోనిమార్గం లేకపోయినా కొద్దగానే ఉన్నా సృష్టించిన యోనిమార్గం సెక్స్ లో పాల్గొనడానికి మామూలుగానే తోడ్పడుతుంది. యోని దగ్గర క్లెటోరిస్, కామనాడులు మామూలుగానే ఉంటాయి.. కనుక  స్త్రీకి సెక్స్ లో తృప్తి మామూలుగానే కలుగుతుంది. గర్భాశయం ఉంటుంది. కనుక సంతానం కూడా కలుగుతుంది. పుట్టుకతోనే గర్భాశయం, యోనిమార్గం నిర్మాణంలో లోపాలు ఉన్నట్లే కొంతమందిలో కన్నె పొర, క్లెటోరిస్, యోని పెదవులు నిర్మాణంలో కూడా లోపాలు ఉంటాయి. ఇటువంటి లోపాలు, తేడాలు సాధారణంగా దాంపత్య సంబంధాలకి, సెక్స్ లో తృప్తికి ఆటంకం కలిగించవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: