నాకు అంతకు ముందులా సెక్స్‌లో ఆసక్తి లేదు. ఎందువల్ల? ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయని కొంతమంది ఈ సమస్యతో  తెగబాధపడుతుంటారు. అలాంటి వారికి... 

సాధారణంగా గర్భం, ప్రసవం తర్వాత జీవితంలోకి ఒక కొత్త ప్రాణి ప్రవేశించడం అనేది ఒక గొప్ప మార్పు. ఈ మార్పుకి దేహం, మనసు రెండూ అనుకూలంగా లేదా ప్రతికూలంగా స్పందిస్తాయి. ప్రసవ వేదన, నొప్పులు, రక్తవూసావం, కుట్లు పడటం, సిజేరియన్ ఆపరేషన్, పాపకు పాలు పట్టడం, పాపతో నిద్రలేమి, రాత్రుల నీరసం, గర్భస్థ స్థితిలో లోపలి శరీరాంగాల్లో వాటి రసాయన ధర్మాల్లో మార్పు రావడం, ప్రసవం తర్వాత సహజ స్థితికి చేరుకోవడం వంటివన్నీ జరుగుతాయి.

 గర్భాశయం, యోని నాళం, యోని రంధ్రంతో సహా కుట్లు లేదా ఎపిసియోటమీ ఆపరేషన్ కలయికలో నొప్పిని కలిగిస్తాయి. ప్రసవ సమయంలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)కి గాయం అయ్యి ఇన్‌ఫెక్షన్ అవుతుంది. ఇది నొప్పికీ, వైట్ డిశ్చార్జ్‌కి కారణం కావచ్చు. అలాగే, సెక్స్ హార్మోన్స్ స్థాయి పడిపోవచ్చు. ఇది కూడా ప్రధానంగా పనిచేస్తుంది.

ఈ స్థితి దంపతుల మధ్య ఎడానికి, దాంపత్య విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అయితే, ఇలాంటి సమయంలోనే భార్య మానసిక, శారీరక స్థితిని భర్త అర్థం చేసుకోవాలి. ఇంటి పని, వంట పనుల్లో, పిల్లల పెంపకంలో పనులు పంచుకుంటూ ఆమెకు ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గించాలి. కాన్పు తర్వాత మానసికంగా భావోద్వేగాల్లో వ్యతిరేక లక్షణాలు కోపం, చిరాకు, ఒత్తిడి లాంటివి గమనిస్తే వెంటనే చికిత్సకు తీసుకెళ్ళాలి. ఆమె అన్ని రకాలుగా కోలుకున్నాకే సెక్స్ జీవితం మొదలుపెట్టాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: