స్తనాలు పెద్దవిగా వుండటం సెక్సు సింబల్ గా బావిస్తారు కొందరు. అందుచేత తమకు పెద్దపెద్ద స్తనాలు లేవని, తమను ఎవరూ ఇష్టపడరని, యుక్త వయసులోని వారంతా నిరాశ పడుతుంటారు. నిజానికి స్తనాల సైజుకు, లైంగికతకు సంబంధం ఏదీ లేదు శాస్త్రజ్ఞులు ఎంత చెప్తున్నా సమాజంలో నెలకొన్న దురాభిప్రాయాలు పోవటం లేదు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో భాగమే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా స్తనాలను పెద్దవిగా చేయడం. మోజున్న యువతులు, ఈ సర్జరీ పట్ల మక్కువ చూపటం సర్వసాధారణంగా జరుగుతుంది. వాస్తవానికి స్తనాల సైజు కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం ఒక శిక్షలాంటిది. శస్త్రవైద్య నిపుణులు ముందుగా స్తనాల అడుగుబాగం కోస్తారు. ఇలా అయితే, కోసిన గాట్లు అంతగా స్పష్టంగా పైకి కన్పించవు. తరువాత, సిలికాన్ అనే పధార్థాన్ని సంచులలో పెట్టి కుడుతారు. సిలికాన్ సంచులు, కాలక్రమేణా కిందికి జారిపోకుండా పాల గ్రంధులకు పాలను అందించే, పాలిండ్లను మూసివేయటమే అవుతుంది. ఇకపై పిల్లలకు పాలిచ్చే పరిస్థితి వుండదు. ఈ ఆపరేషన్ చేయించుకున్న పలువురు స్త్రీలు తమకు నెలల తరబడి, ఈ గాయపు బాధలు తప్పడం లేదని అంటున్నారు. వారి చనుమొనల్లో రసానుభూతులు పూర్తిగా నశించి పోయాయంటున్నారు. అట్లాగే సర్జరీ తరువాత చాలామంది. స్త్రీలు లైంగికత కోసం ఇలా స్తనాలను కోయించుకోవడం సిగ్గు పడవలసిన విషయంగా బావిస్తున్నారు. మరొక అంశం ఏమిటంటే, వాటిని కనిపెట్టెయ్యడం చాలా సులభం, లైంగికంగా ఎవరిని ఆకర్షించటానికి, ఈ సర్జరీ చేయించుకోవడం జరిగిందో, వారికి ఈ విషయం తెలిసి పోయిన తర్వాత, సహజంగా వుండే స్తనాల సోయగం లోపం చేత అసంతృప్తి ఏర్పడే అవకాశాలు మెండుగా వున్నాయి.దీని వల్ల సహజమైన అందాలను ఇష్టపడే వ్యక్తులకు ఒరిగేదేం వుండదు. అంతేకాక, స్తనాలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పెద్దవిగా చేసుకుంటే అవి సహజ స్తనాల మాదిరిగా, తేలుతూ వుండవు. ప్రక్కటెముకలకు గట్టిగా అంటి పెట్టుకుని వుంటాయి. నిక్కబొడుచుకుని వున్న పెద్ద పెద్ద స్తనాలుగా అవి అందాలను ఇస్తాయేమో గానీ, వీటిని మోస్తున్న స్త్రీకిమాత్రం, ఛాతిమీద బరువు పెట్టి నట్టన్పిస్తుంది. బోర్లా పడుకున్నప్పుడు. ఇవి ఛాతికింది గట్టిగా తగులుతూ వుంటాయి. సహజమైన స్తనాల మాదిరిగా, ప్రక్కలకు సర్తుకోవు దాని వల్ల ఛాతి కింద చెక్కముక్కలు అమర్చినట్లుగా వుంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి, ఫైబ్రోనిన్ అనే వ్యర్ధపధార్థం చేరిపోవడం వల్ల స్తనాలు రెండు శిలావిగ్రహం స్తనాలు మాదిరిగా ధృఢంగా అయిపోతాయి. అంచేత చాలామంది. సిలికాన్ సంచులను తొలగించమని తిరిగి సర్జన్లను సంప్రదిస్తున్నారు. కాగా కొసమెరుపు ఏమిటంటే సిలికాన్ పధార్థం, క్యాన్సర్ కు కూడా కారణమవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, స్తనాలు పెద్దవిగా కనబడటం కోసం, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఏ మేరకు ప్రయోజనకరమో?  

మరింత సమాచారం తెలుసుకోండి: