జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నిజమైన ప్రత్యుర్ధుడి చంద్రబాబునాయుడే అని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అబద్ధం. జగన్ కు అసలైన ప్రత్యర్ధి మాత్రం ఎల్లోమీడియానే.  నిజానికి జగన్ రాజకీయనేత కాబట్టి మీడియాలో ప్రత్యర్ధులుండాల్సిన అవసరం లేదు. అలాగే  చంద్రబాబు కూడా రాజకీయ నేతే కాబట్టి ఏమైనా విభేదాలుంటే జగన్ తోనే ఉండాలి. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ నేతకు మరో రాజకీయ నేతే ప్రత్యర్ధిగా ఉంటాడు.

 

కానీ ఏపిలో మాత్రం విచిత్రమైన పరిస్ధితులు నెలకొన్నాయి. జగన్-చంద్రబాబు ప్రత్యర్ధులన్నది కేవలం లాంఛనమే. జగన్ కు అసలైన ప్రత్యర్ధులు మాత్రం ఎల్లోమీడియా యాజమాన్యాలే అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈనాడు, ఈ టీవీల యాజమని రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణలను జగన్ ఎదుర్కొంటే చంద్రబాబును ఎదుర్కొన్నట్లే. ఎందుకంటే చంద్రబాబుతో ఎల్లోమీడియా యాజమాన్యాలకున్న సంబంధాలు ఏమిటో యావత్ ప్రపంచానికి తెలుసు.

 

చంద్రబాబు అధికారంలో ఉంటే ఇమేజి పెంచటానికి జనాల కళ్ళకు గంతలు సైతం కట్టేస్తారు. జరగని పనులను జరిగినట్లుగాను, చేయలేని పనులను చేసేసినట్లుగాను చూపిస్తుంటాయి. అలాగే జరుగుతున్న అవినీతిని, అరాచకాన్ని జనాలు చూడకుండా గంతలు కట్టేస్తాయి. మొన్నటి ఐదేళ్ళ పాలనలో ఇటువంటి విన్యాసాలు ఎన్నింటినో చేసినా జనాలు మాత్రం మాడు పగులగొట్టారు. దాంతో ఎల్లోమీడియా జగన్ పై పగబట్టినట్లుంది. నిజానికి జగన్ ముందు చంద్రబాబు ఏ విషయంలో కూడా నిలబడలేడు.

 

అందుకనే చంద్రబాబు రక్షణకు ఎల్లోమీడియా రంగంలోకి దిగేసింది. చంద్రబాబు చెబితే జనాలు నమ్మటం లేదన్న విషయం అర్ధమైపోగానే  జగన్ పై బురద చల్లేందుకు ఎల్లోమీడియా గడచిన పదిమాసాలుగా నానా అవస్తలు పడుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  చంద్రబాబు చెప్పిన మాటలనే కాదు ఎల్లోమీడియా రాతలను కూడా జనాలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.

 

తాజాగా కరోనా వైరస్ కేసుల విషయంలో చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంత తప్పుడు విషయాలను అచ్చేస్తున్నా ఉపయోగం కనబడటం లేదు. నిజానికి జనాలకు కావాల్సింది పనిచేసే మనిషి, కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే చేతులు మాత్రమే. అవకాశం ఉన్నంతలో జగన్ పై రెండు పనులు చేస్తున్నాడు. కాకపోతే పనిచేయాలే కానీ ప్రచారం అవసరం లేదన్న ఆలోచన కారణంగానే జగన్ తన చేతలతోనే తానేంటో చెప్పుకుంటున్నాడు. ఏమీ చేయలేకపోగా జగన్ పై చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసి చేస్తున్న దుష్ట్రచారాన్ని అందరూ చూస్తున్నదే. అంటే జగన్ కు అసలైన ప్రత్యర్ధులు ఎల్లోమీడియానే అర్ధమైపోయిందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: