పండిత పుత్ర పరమ శుంఠ ! అంటే ఏంటో అనుకున్నాం కానీ, దానికి అర్ధం పరమార్ధం ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. తండ్రి ప్రపంచ మేధావి... పుత్రా రత్నం చంద్ర మండలం మేధావి అన్నట్టుగా ఉంది పసుపు పార్టీలో పరిస్థితి. పధ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా సీఎం కుర్చీలో కూర్చున్నా, ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటూ గొప్పలు తిప్పలు పడుతూనే చెప్పుకున్నా... ఇప్పుడు మాత్రం సీన్ సితార్ అయిపొయింది. ఒక వైపు కరోనా మరో వైపు వయస్సు తెగ భయపెట్టేస్తున్నాయ్. అయినా చేసేది ఏమీ లేదు చూడడమే తప్ప. ఇక తన రాజకీయ వారసుడిని చూసి నవ్వాలో ఏడవాలో తెలియని తికమక... గజిబిజి గందరగోళ పరిస్థితి బాబు గారిది. అయినా తప్పదు కదా... పాడు జీవితము యవ్వనము అనుకుంటూ పాటలు పాడుకోవాల్సిందే. ఇక బాబు గారి తెలివితేటలన్నీ ఇప్పుడు ఎక్సపైర్ అయ్యాయి. ఇప్పుడు అంతా అప్ డేట్ వెర్షన్.

IHG


సినబాబు గారు ఎమ్యెల్సీగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు కదా...! ఉన్నా లాభం ఏమీ లేదు అనేది అందరికి తెలిసిన విషయమే అనుకోండి. ఓరి బాబు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకోరా బాబు అని లచ్చల్ లచ్చల్ జీతాలు ఇచ్చి మరీ ట్యూషన్ లు పెట్టించిన మందలగిరి తెలివితేటలు ఎక్కడికి పోతాయ్ . శాసనమండలిలో ఎలా నడుచుకోవాలో ... ఎలా ఉండాలో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా అవేమి పట్టవు.. పట్టించుకోడు సినబాబు. చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నట్టుగా ఫోన్ తో ఆడుకుంటూ... సభలో జరిగే తతంగం వీడియో తీసి తన సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి చూపిద్దాం అంటే ..? ఈ వైసీపీ వాళ్ళకేమో పనీ పాటా లేక నాతోనే ఆడుకుంటున్నారు అంటూ సినబాబు పెద్దగానే చిరాకు పడుతున్నాడు. 

 

అసలు శాసనమండలి అంటే పెద్దల సభ అని ఈ సినబాబు.. పసి బాబు.. కసిబాబు కి ఎవరైనా చెప్పండ్రా ... ! అలా వదిలేయకండ్రా బాబు అని ఇప్పుడు సొంత పార్టీ, పరాయి పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయినా వింటే కదా ! సభలో వీడియో లు, ఫోటోలు తీస్తూ నచ్చిన చానెళ్లకు పంపుతూ బాబు గారి పుత్రా రత్న చేస్తున్న హడావుడి విమర్శలపాలవుతున్నా స్పందించడేమి మహానుభావుడు ...? అవునులే ఆయన పెపంచ మేధావి గారి పుత్ర రత్నం కదా ...! ఆయన చెప్పాడు ... చెప్పినా ఈయన గారి బుర్రకెక్కదు. సరి సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: