నరక చతుర్దశి ఆశ్వయుజ బహుళ చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ నరకలోక వాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ ఇది. అయితే ఈ రోజు మూడు ప్రధానమైన పుణ్య విధుల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఏ పుణ్య విధుల చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  


చంద్రోదయానికి ముందు చేసే నువ్వులు నూనెతో కూడిన అభ్యంగన స్నానం చెయ్యాలి. అయితే ఈ చతుర్దశి నాడు లక్ష్మి దేవి నువ్వుల నూనెను ఆవహించి ఉంటుంది అందుకే ఆ రోజు తప్పకుండా నువ్వుల నూనె పట్టించుకోవాలని పెద్దలు చెప్తున్నారు. అలాగే తలస్నానం చేసే నీటిలో ఉత్తరేణి, తమ్మి ఆకులను నూరి కలిపి ఆ నీటితో స్నానం చేస్త మెదడు పని తీరు కూడా బాగుంటుంది.


యమా తర్పణం, స్నానానంతరం ఉత్తరేణి ఆకులను తలపై పెటుకుని, యమాయ నమః, మృత్యువేనమః, వైవస్వతాయనమః, సర్వభూతక్షయాచ నమః, ధ్ధ్నాయనమః, పరమేష్టినే నమః, చిత్రాయ నమః, ధర్మరాజాయ నమః, అంతకాయ నమః, కాలాయ నమః, ఔదుంబరాయ నమః, నీలాయ నమః, వృకోదరాయ నమః, చిత్రగుప్తాయతే నమః అనే 14 నామాలను స్మరిస్తూ, నామానికి మూడు తిలం జలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించాలి. దీని వల్ల పితృ దేవతలకు నరకబాధ తప్పి స్వర్గప్రాప్తి కలుగుతుంది.


నరక చతుర్దశి రోజు సాయంత్రం తల్లిదండ్రులు మృతి చెందిన వారు తప్పక ఇంటి దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి. దీనివల్ల పితృ దేవతల కోసం వెలిగించే ఈ దీపాల వెలుగులో నరకానా ఉన్న పెద్దలు స్వర్గలోకానికి పయన మవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మూడు ప్రధానమైన పుణ్య విధులను పాటించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: