షిరిడి.. ఎంతోమందికి ఇష్టమైన దైవ సన్నిధి. సాయిబాబాను ఆరాధించే భక్తులు జీవితంలో ఒక్కసారైనా షిరిడికి వెళ్లాలని కోరుకుంటారు. అయితే అలా వెళ్ళాలి అనుకునే వారికీ కొన్ని విషయాలు తెలియదు. షిరిడి సాయిని ఆరాధించే వారు తప్పకుండా షిరిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

 

ఈ షిరిడి సాయిబాబును చలికాలంలో అంటే ఈ కాలంలో చాలామంది సాయిబాబా భక్తులు నడుచుకుంటూ ఇక్కడికి చేరుకుంటారు. సాయిబాబా ఇక్కడ 16 ఏళ్ల వయస్సులో ఇక్కడికి వచ్చారని.. 1918లో కాలం చేసేవరకు ఆయన అక్కడే ఉన్నారని పురాణాలూ చెప్తున్నాయి. సాయిబాబా దైవశక్తికి ఎంతో మంది ఆయనకు భక్తులయ్యారు.

 

సాయిబాబా భక్తుడైన గోపాల్ రావు 1922లో ఈ షిరిడి ఆలయాన్ని కట్టించారు. సాయిబాబా ఎక్కడైతే పరమపదించారో అక్కడే ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ షిరిడి ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

 

మొత్తం మార్బల్ రాళ్లతో నిర్మించిన ఈ లయంలో ఒకేసారి 600 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. రోజూ తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 10 గంటల వరకు బాబాను దర్శించుకోవచ్చు. గురుపూర్ణిమ, దసరా, రామనవమి రోజుల్లో రాత్రివేళ్లల్లో కూడా ఆలయం తెరిచే ఉంటుంది.

 

బాబాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు షిరిడీలో భక్తుల చాలా రద్దీ చాలా ఉంటుంది. వారాంతంలో కూడా షిరిడీలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఇక్కడ రోజుకు 60 వేల నుంచి లక్షకు పైగా భక్తులు విచ్చేస్తారు. అయితే, డిసెంబరు నుంచి ఫిబ్రవరి నెలల్లో షిరిడీలో భక్తుల రద్దీ ఒక మోస్తారుగా ఉంటుంది. 

 

అయితే ఈ బాబా ఆలయానికి తెల్లవారుజామున 5.15 గంటలకు కాకడ హారతి ఇస్తారు. ఈ సందర్భంగా సాయిబాబాకు పంచదార, వెన్న పెడతారు. మధ్యాహ్నం 12 గంటలకు దూప్ హారతి, రాత్రి 10.30 గంటలకు శేజ్ హారతి ఇస్తారు. ఈ సమయంలో బాబాను ఎక్కువ సమయం చూసేందుకు అవకాశం ఉంటుంది. 

 

షిరిడి సాయిబాబా దర్శనానికి ఎన్నో గంటల సమయం పడుతుంది దర్శనానికి. అయితే దర్శనం వేగంగా పూర్తి కావాలంటే ఆన్‌లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. చూశారుగా ఇన్ని ఉన్న షిరిడీలో దొంగలు కూడా బనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: