శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను రెండు రోజులపాటు మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించింది టీటీడీ. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలన్న ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా.... భక్తుల నుంచి వ్యతిరేఖత రావడం....విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించడంతో టీటీడీ క్లారిటీ ఇచ్చేసింది.  గతంలో లాగానే ఏకాదశి, ద్వాదశి రోజులలో మాత్రమే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది.  


అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారు వెలసిన  తిరుమల ....ప్రత్యక్ష వైకుంఠంగా ప్రసిద్ది.  శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి తిరుమలకు  సాధారణ రోజులలోనే 70 వేల మంది భక్తులు తరలివస్తుండగా.... సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుంది. ఇక ఏడాదికి రెండు రోజులు పాటు మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు లక్షలాది మంది  తిరుమలకు వస్తుంటారు.  సాక్షాత్తు స్వామివారు వెలసిన దివ్యక్షేత్రం కావడం.... శ్రీవారి ఆలయంలో వున్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఎంతగా అంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం 48 గంటల ముందుగానే క్యూ లైన్లలోకి భక్తులు చేరుకుంటారు. రెండు రోజులలో లక్షా 70 వేల మందికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించే అవకాశం ఉంది. దీంతో..... తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడు వైకుంఠ ద్వార దర్శనం కోసం తాపత్రయం పడుతుండడంతో..... ఆ రెండు రోజులు భక్తుల తోపులాటలు, దర్నాలు సర్వసాధరణంగా మారిపోతున్నాయి.  

 

భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. అందులో భాగంగా శ్రీరంగం తరహాలో శ్రీవారి ఆలయంలో కూడా పది రోజులు పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలని ప్రతిపాదన  తెరపైకి వచ్చింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆగమ సలహా మండలి ముందు ఈ అంశాన్ని వుంచింది. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో అధ్యానోత్సవాలు నిర్వహిస్తున్నందున.... పది రోజులు పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచవచ్చు అంటూ అంగీకరించింది ఆగమ సలహా మండలి. 

 

ఆగమసలహమండలి సభ్యులు ఆమోదంతో టీటీడీ పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలన్న ప్రతిపాదన పై పాలకమండలిలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొనడంతో భక్తులు నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. శ్రీవారి ఆలయంలో గత సంప్రదాయాలును అనుసరించి రోండు రోజులు పాటు తెరిచి భక్తులును అనుమతించాలని..... ప్రాశస్త్యం కలిగిన రోజున కాకూండా ఇతర రోజులలో అనుమతించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని భక్తులు అభిప్రాయపడడం.... మరో వైపు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ కూడా టీటీడీని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించడంతో పాటు శ్రీవారి ఆలయంకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా సంప్రదాయాలును కోనసాగించాలని సూచించడంతో టీటీడీ క్లారిటీ ఇచ్చేసింది. గత సంప్రదాయాలును అనుసరించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులోనే మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం భక్తులుకు కల్పిస్తామని పేర్కొన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దీంతో గత నెల రోజులుగా సాగుతున్న చర్చలకు క్లారిటీ వచ్చినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: