తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతటి ప్రాచుర్యం ఉందో అందరికీ తెలిసిన విషయమే ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల నుండి సైతం ఎంతో మంది భక్తులు తిరుమలకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఒకసారైనా శ్రీ వారిని దర్శించుకోవాలి అని ఆశ పడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే అపురూప దైవంగా భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారిని దర్శించుకునేందుకు ఎంతోమంది తిరుపతి  చేరుకుంటారు . ఎంతోమంది మహ మహులు  సైతం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుగుతుంటారు. ఇక శ్రీ వారికి కానుకలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు భక్తజన సందోహం కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతూంటాయి. 

 

 

 ఎంతోమంది ధనవంతులు తిరుమల తిరుపతి దేవస్థానం లోని కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న శ్రీవారిని దర్శించుకుని... తాము సంపాదించిన దాంట్లో ఎంతోకొంత శ్రీవారి సమర్పించుకుంటూ వుంటారు. ఎంతోమంది శ్రీవారి ఆలయానికి భారీ మొత్తంలో విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం రోజురోజుకు రెట్టింపవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్నట్లు... హుండీ ఆదాయం కూడా బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో రద్దీ బాగా కొనసాగుతుంది. 

 

 

 

 తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది . నిన్న మంగళవారం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హుండీ  ఆదాయం భారీ మొత్తంలో నమోదయింది. ఏకంగా మంగళవారం నాడు 4.14 కోట్ల ఆదాయం నమోదై  రికార్డు సృష్టించింది. ఇకపోతే సప్తగిరులపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ సంక్రాంతి వరకు ఉండే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనార్థం 16 గంటలకు పైగా సమయం పట్టనున్నట్లు సమాచారం. టైం స్లాట్ దర్శనం దివ్యదర్శనం 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి గంటల సమయం వరకూ పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు స్వామివారిని 76,705 మంది భక్తులు దర్శించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: