భక్తుల ఆధ్యాత్మిక దివ్యధామం తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన దేవుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్ట కలిగినది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఏ సమయంలో ఆయన భక్త జనాలతో జనసంద్రంగా కనిపిస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవాలయం. ఇక్కడికి విచ్చేసే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. 

 


 ఇకపోతే తాజాగా 2019-20 కి సంబంధించిన శ్రీవారి వార్షిక బడ్జెట్  కు  టీటీడీ ఆమోదం తెలిపింది. 3220 కోట్లుగా శ్రీవారి వార్షిక బడ్జెట్ ను  టీటీడీ ఆమోదం తెలిపింది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగేలా చర్యలు తీసుకుంటామంటూ టీటీడీ పాలక మండలి తెలిపింది. 2019- 20 వార్షిక డివైస్ బడ్జెట్కు ఆమోదం తెలిపిన పాలకమండలి..  ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలను లడ్డూ ప్రసాదం కొరకు సబ్సిడీ అందజేస్తుంది. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు టీటీడీ అడిషనల్ ఈవో. 

 


 కాగా  ఎనిమిది కోట్ల తో రెండు ఘాట్ రోడ్లు నిర్మించనున్నట్లు టీటీడీ పాలకమండలి సమావేశంలో వెల్లడించారు. 30 కోట్లతో ముంబైలో ఆలయం నిర్మించడానికి టీటీడీ పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా ఘాట్ రోడ్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పది కోట్ల రూపాయల నిధులతో ఘాట్ రోడ్ లో రెండు  క్రాష్  బారియర్లు  ఏర్పాటు చేసేందుకు పాలకమండలి నిర్ణయించింది. 3.4 కోట్ల రూపాయలతో తిరుపతిలోని కళ్యాణ మండపాలు ఏసీ లను ఏర్పాటు చేసేందుకు పాలకమండలి సమావేశంలో నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆలయ ఈవో . కాగా  ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు నియమించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: