షిరిడీ సాయి బాబా అంటే యావత్ భారత దేశం భక్తి తన్మయత్వంతో ఆయన సేవలో తరిస్తారు.  మనిషి రూపంలో ఉన్న నిజమైన భగవంతుడు షిరిడీ సాయి బాబా. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఇక ఎంతో విశాలమైన ఆకాశమే కప్పుగా దాని కింద సువిశాలమైన భూమియే పరుపుగా భావిస్తూ గడిపేవాళ్లే సాధువులు. వారు ఎక్కడైనా నివశిస్తుంటారు.

 

భౌతికపరమైన వసతి సౌకర్యాల పట్ల వాళ్లకేమాత్రం పట్టదు. అయితే సామాన్యులకు ఆ జీవన విధానంలోని అంతరార్థం ఒక పట్టాన అర్థంకాదు.  తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు.  వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. బాబా మసీదులో వెలిగిస్తున్న దీపాలకు కావలసిన నూనెను షిరిడీ వర్తకులు ఉచితంగా ఇస్తుండేవారు. కానీ వారి బుద్ధి మందగించింది. బాబాకు నూనెను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. వారు చేసింది క్షమించరాని తప్పిదమే అయినప్పటికీ, అందులోనూ మంచి జరిగింది.  

 

బాబా ఎప్పటివలెనే ద్వారకామాయి ముందు దీపాలను వెలిగించేందుకై నూనె కోసం ఓ అంగడి ముందు నిలిచి... అల్లా మాలిక్ అన్నాడు. నూనె అయిపోయింది వెళ్లు వెళ్లు అన్నాడా వర్తకుడు. మారుమాట్లాడకుండా మరో దుకాణం ముందుకెళ్లి నిలబడ్డ బాబా మళ్లీ అల్లా మాలిక్ అన్నాడు. వ్యాపారి బాబాను పొమ్మన్నారు.. అయితే మసీదులో దీపాలు వెలిగించేందుకు చిన్నారులు రాగా.. అక్కడ నూనె లేకపోవడంతో బాబా ఏంటీ పరిస్థితి అనగానే.. బాబా అక్కడికి వచ్చి మెల్లగా లేచిన బాబా మసీదు గోడలపై ప్రమిదలను పేర్చుతున్నాడు. ఆ ప్రమిదల్లో ఒత్తులను అమర్చసాగాడు. 

 

బాబా చేస్తున్న పనిని చూస్తున్న వర్తకులకు విస్మయం కలిగింది. నూనె లేకుండా దీపాలను ఎలా వెలిగిస్తాడు అని చూస్తున్నారు. ఈ విషయాన్ని విన్నవారంతా అక్కడకు చేరుకుంటున్నారు. అంతా బాబానే చూస్తున్నారు. బాబాకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.  ఆ తర్వాత ఆయన మహిమతో దీపాలు వెలిగాయా.. అందరూ ఆశ్చర్యపోయి బాబా లీలల గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: