శబరిమల.. కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం. దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే శ‌మ‌రిమ‌ల 18మెట్ల విశిష్ట‌త ఏంటి అన్నది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

 

అయితే వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను `పదునెట్టాంబడి` అంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు. మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలను (కళ్లు, చెవులు, నాసిక, నాలుక, చర్మం) తరువాతి ఎనిమిది మెట్లు రాగద్వేషాలను ( తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అహంకారం) సూచిస్తాయి. తదుపరి మూడు మెట్లు సత్వ, తమో,రజో గుణాలకు ప్రతీక. 17 మరియు 18 మెట్లు విద్యను, అజ్ఞానాన్ని సూచిస్తాయి. 

 

ఈ 18 మెట్లను ఒకమారు ఎక్కడానికి, మరోమారు దిగడానికి ఉపయోగించాలి. అలాగే 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో `పానవట్టం`పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: