తెలుగువారు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి. సన్ (సూర్యుడు )క్రాంతి (వెలుగు )ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో లోగిళ్లు కొత్త అల్లుళ్లతో , బంధుమిత్రులతో కళకళలాడతాయి.సంక్రాంతి ముందు రోజువచ్చే పండుగ భోగి. తరువాత వచ్చేది మకర సంక్రాంతి, తరువాత వచ్చేది కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో వేరువేరు పేర్లతో పిలుస్తుంటారు

 

. దీని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.సంక్రాంతికి ముందు నెల పెట్టడం అంటే.. ఇంటి ముందు రంగవల్లులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించడం. సరిగ్గా నెలరోజుల ముందు నుంచి ఇవి సాగుతాయి. చివరి రోజున రథ ముగ్గును వేస్తారు.

 

జానపద కళలు సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని ప్రాంతాల్లో 'కోడి పందేలు', పతంగులు ఎగురేయడం, తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబలి క్రీడలు సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తారు.

దీనికి శాస్త్రపరంగానూ ప్రత్యేకత ఉంది. నక్షత్రాల ఇరవై ఏడు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. వీటిని మొత్తం 108 పాదాలుగా విభజించారు. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంక్రాంతిగా వ్యవహరిస్తారు.

 

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు 'మకర సంక్రాంతి' అని అంటారు.పూర్వము గోదాదేవి పూర్వఫల్గుణ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసి వనంలో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుడిని ఆరాధించినది. ధనుర్మాసం మొత్తం ఒక నెల రోజులు నిష్టతో వ్రతమాచరించి చివరి రోజైన మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుంది. ఈవిధంగా మకర సంక్రాంతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: