ధనుర్మాసంలో వచ్చేటటువంటి భోగిని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారు తెలుగు ప్రజలు. 5 రోజుల క్రితం నుండి సంక్రాంతి పండుగ యొక్క సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు పండుగ స్టార్ట్ అయ్యి పండగ వాతావరణం నెలకొంది. ఇకపోతే ఈ కొన్ని గంటల్లో వచ్చే భోగి పండగ సందర్భంగా యువతులు వాకిట్లో ముగ్గులు వేసి వాటి పై గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసి.. నైవేద్యం సమర్పించి... మంచి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భోగి పాటలు పాడుతూ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే భోగి ముగ్గుల గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షణ చేసిన కన్నెపిల్లలు కృష్ణుడికి కృష్ణుని యొక్క గోపికలుగా తమనితాము భావించుకోవాలి. అలాగే సంక్రాంతి పండుగ రోజు కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తే భగవంతుడికి మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా కనిపిస్తారట. దాంతో మీ జీవితంలో అంతే అంతా మంచే జరుగుతుంది.


ఇకపోతే సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు మీరు ఆరెంజ్, ఎల్లో, క్రీమ్ ఈ 3 రంగుల వస్త్రాలను ధరిస్తే... ఈ సంవత్సర కాలంలో మీకు ఎటువంటి ప్రాణ హాని జరగదు. అదేవిధంగా అనేక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే అన్ని అప్పులు తీరిపోయి.. మీరు ఏ కొత్త పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది. అయితే, మీ వంతుగా చెయ్యాల్సింది ఏంటంటే.. ఈ మూడు రంగుల దుస్తులను వేసుకున్నప్పుడు మీ మనసు నిండా స్వామివారిని నింపుకొని ఆయనకు దర్శనమివ్వడం. ఈ విధంగా చేస్తే దేవుని కూడా తన వంతుగా మిమల్ని అదృష్టవంతులుగా చేస్తారు. సో, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రేపు వచ్చే భోగి పండుగ రోజు మేము పైన చెప్పిన విధంగా ఆయా ఆచారాలను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: