మూడు రోజులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగా సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. అయితే భోగి పండుగా విశిష్టతలు మనకు ఇప్పటికే తెలుసు. అలాంటి ఈ భోగి మంటలలో మనం ఇంట్లో పాతవి అన్ని వేసి అంటిస్తాము.. మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు, పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని పెంచుకుని మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. 

 

కానీ పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని అంటారు. అయితే, పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. 

 

భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాన్ని ఆ దేశాని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు... అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి. ఇలా కాలుష్యానికి చెక్ పెట్టి భోగి మంటలతో పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: