ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు మంగళవారం,17.03.2020 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 17C°-31C°

 

• నిన్న 55,827 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్ లో భక్తులు సర్వదర్శనం కొరకు వేచి ఉండాల్సిన పని లేదు నేరు క్యూ లోకి వెళ్ళి స్వామివారిని దర్శించు కోవచ్చు.

 

 • ఈ సమయం శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారుగా 01 గంటల సమయం  పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.06 కోట్లు.

 

• నిన్న 13,853 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

• ఈరొజు దివ్యాంగులకు వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం కలదు,(10-2-3 గంటలకి అనుమతిస్తారు).

 

• రేపు ఐదు సంవత్సరం లోపు వయసున్న చిన్నపిల్లల తల్లీతండ్రు లకు ప్రత్యేక దర్శనం కలదు,(9-1.30 వరకు అనుమతిస్తారు.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కలదు.

 

ముఖ్య గమనిక:

 

• నేటి నుండి భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ల్లోని గదులలో వేచి ఉండే వీలు లేదు.


• టైమ్ స్లాట్ ప్రకారం వారు పొందిన టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతిస్తారు.


• అస్వస్థత కి లోనైన భక్తులు తిరుమలకి రావొద్దు.


• విదేశాల నుండి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమల యాత్ర కి రాకండి.


• అలిపిరి, శ్రీవారి మెట్టు మరియు టోల్ గేట్ వద్ద భక్తులకు వైద్యపరిక్షలు నిర్వహిస్తున్నారు.


• అస్వస్థత కి గురైన భక్తుల యాత్రను రద్దు చేసుకొని వారి టికెట్టును dyeotemple@gmail.com కి  మెయిల్ చేస్తే మరో రోజుకి దర్శనం ఏర్పాటు చేయబడును లేదా నగదు తిరిగి చెల్లించబడును.


• భక్తులు సహకరించ వలసిందిగా ప్రార్థన.

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

 

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి: