శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు మాల వేసుకుని వ‌స్తుంటారు. శబరిమలలో కొలువైన అయ్యప్పను హిందువులు హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశ వ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం: దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. అయితే శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి, నియమ నిష్టలతో 41 రోజులు దీక్ష చేస్తారు. 

 

నియమ నిష్టలతో అయ్యప్ప దీక్ష చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్షగా పేర్కొంటారు. ఇంతకీ మండల దీక్ష ప్రత్యేకత ఏంటి..? అంటే.. కార్తీక మాసం నుంచి మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తారు. స్వామి చింతనలోనే సమయం గడపడం సాత్విక జీవనంగా పాటిస్తారు. గురుస్వామి ఉపదేశంతో నిత్యం భజన కార్యక్రమాల్లో ఉంటారు. ‘శవనం, కీర్తనం,స్మరణం, పాద సేవనం,అర్చనం, నమస్కారం, ధ్యాసం, సఖ్యత్వం, ఆత్మ నివేదినం’ అనే నవ విధ భక్తులను మండల దీక్ష సాక్షాత్కరింపజేస్తుంది. 

 

దీక్ష తీసుకున్న వారు ఆత్మను పూర్తిగా స్వామికే నివేదిస్తారు. దీక్షలో ఉన్నంత కాలం తమ గుర్తింపును కోల్పోయి స్వామిగానే పిలువ బడుతారు.  వీలైనంత వరకూ మహిళలకు దూరంగా ఉంటూ..శరణఘోషలతో.. భజనలతో స్వామిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు. నల్లని దుస్తులు ధరిస్తారు. రోజూ తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుంటారు. చన్నీటి స్నానం ఆచరిస్తారు. అనంతరం పూజలు చేస్తారు. తిరిగి సాయంత్రం వేళలో చన్నీటి స్నానమే చేస్తారు. దీక్ష కాలమంతా కటిక నేలపై పడుకుంటారు. దీక్షల్లో పడిపూజ ముఖ్యమైంది. 18 మెట్లను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు.  దీక్షాకాలం పూర్తైన తర్వాత  అయ్యప్ప స్వామిని ద‌ర్శించుకుని మాలతీస్తున్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: