హనుమంతుడు.. ఈ పేరు వింటేనే చాలా మందికి కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది. వాయు దేవుని కుమారుడు, వానర యోధులలో ప్రముఖుడు, ముఖ్యమైనవాడు హనుమంతుడు. ముఖ్యంగా రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రలలో హనుమంతుడు ఒకటి. ఇతను హిందూదేవతైన‌ప్ప‌టికీ.. భారతదేశంలోనేకాకుండా ఇతరదేశాలలో కూడా అపారభక్తిని కలిగివున్నారు. హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుంచి విముక్తి, కోరిన కోర్కెలు తీరడం వంటివి సిద్ధిస్తాయి.

IHG

హనుమ లేని రామాయణం పరిపూర్ణం కాదు. అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. మనసుని మందిరంగా చేసుకుని శ్రీరాముని భక్తితో ఆరాధించాడు. అయితే అలాంటి శ్రీ‌రాముడే హ‌నుమంతుని మ‌ర‌ణాన్ని ఆదేశించార‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్ళి, విశ్వామిత్రుని తప్ప అందరు ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దానికి కారణం ఆయన రాజుగా ఉన్నప్పుడు ఋషులకు తగినంత గౌరవం ఇవ్వలేదని చెబుతాడు. నారదుని ఆజ్ఞల మేరకు, హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులని ప్రభావితం చేయలేదు. 

IHG

కానీ, నారదుడు విశ్వామిత్రుని వద్దకి వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా చెబుతాడు. హనుమ ఏమిటి మిమ్మల్ని అగౌరవపరిచాడు అని నార‌దుడు అడ‌గ‌గా..  ఆగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను విధించమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు, గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక,. హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి, ఆపై మరణశిక్షను ఆదేశించారు. అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన నారదుడు తాను చేసిన తప్పేంటో తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్లి హనుమను రక్షించమని వేడుకుంటాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: