బక్రీద్ అన్ని దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన పండుగ దీనిని ముస్లిం లు ఎంతో పరమ భక్తి తో జరుపుకుంటారు. అయితే దీని పండుగ వెనుక చాలా చరిత్ర ఉంది. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

Image result for bakrid

హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ ఏడు  ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు అంటే ప్రార్థనలుచేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా ముహమ్మద్  ప్రవక్త గోరీ ఉన్ననగరం ను సందర్శిస్తారు.

Related image

అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను ఎంతో శ్రద్ధతో జరుపుకుంటారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అంటే ధార్మిక ప్రసంగం తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను ఒంటె, మేక, గొర్రె, ఎద్దు మాత్రమే ఖుర్బానీ అంటే బలి ఇస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: