సాధారణంగా వినాయక చవితి అనగానా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది..ఎందుకంటే వినాయక విగ్రహాలు రక రకాలు కలర్లతో అందంగా తీర్చి దిద్దుతారు.  అయితే ఈ రంగుల్లో కెమికల్స్ ఉండటంతో నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీరు కలుషితం అవుతుందని గత కొంత కాలంగా రంగులపై నిషేదం పెడుతున్నా..తయారీ దారులు మాత్రం అలాగే తయారుచేయడం..భక్తులు ఆ విగ్రహాలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేయడం జరుగుతుంది.   
ఈ సంవత్సరం, అంతటా ఎకో- గణపతి ప్రచారం ఊపందుకుంటోంది. పర్యావరణం కాలుష్య బారినపడకుండా మట్టితో రూపొందించే విగ్రహాలను ఉపయోగించాలంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. 

Image result for eco ganapathi

కెమికల్ పదార్థాలతో తయారైన విగ్రహాలను వినియోగించొద్దంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడంతోపాటు విగ్రహాల తయారీకి శిక్షణనిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా జరిగే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించేందుకు ముందుకొస్తున్నారు.


 కెమికల్ పదార్థాలతో తయారైన విగ్రహాలు ఉపయోగించడం వల్ల జరిగే నష్టంపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రకృతికి నష్టం వాటిల్లకుండా వినాయక చవితిని నిర్వహించేందుకు పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాయి. 

Image result for eco ganapathi

మట్టితోనే కాకుండా కూరగాయలు, ఆకులు, కాగితాలతోనూ వినాయకుని ప్రతిమలు రూపొందించారు. మరోవైపు విద్యార్థులతోపాటు మహిళలు కూడా మట్టి వినాయకుడిని రూపొందించేందుకు శిక్షణతీసుకుంటున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. దీనికోసం అందరం కలిసికట్టుగా పోరాడి మట్టి విగ్రహాలను వినియోగించడమే కాదు..వినియోగించాలని అందరికీ తెలియజేయాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: