హిందువుల పండుగలు చాలా వరకు పగలే జరుపుకుంటారు కానీ శివరాత్రి మాత్రం ఒక రాత్రి జరుపుకుంటారు. అయితే రాత్రి జరుపుకున్న ఈ పండుగలో చాలా ప్రత్యేకతలు దాగి ఉన్నాయి.

Related image

ముఖ్యంగా హిందూ దేవుళ్లలో శివుడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సృష్టికి మూలం శివుడు అని శివుడి నుంచి జీవన్ పుట్టుకొచ్చిందని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువుల పండుగలలో చాలా వరకు పండుగలు పగలు మాత్రమే జరుపుకుంటారు కానీ శివరాత్రి మాత్రం రాత్రి జరుపుకుంటారు దానికి గల కారణం ఏమిటంటే..మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వది కాలం.

Image result for lord shiva

కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు,పూజలు,భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది.ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్య ప్రదమైన రోజు. మహశివరాత్రిని హిందువులు ఏంతో గొప్పనైన పర్వదినంగా జరుపుకొని శివున్ని కొలిచి తరిస్తారు.

Related image

ఈ ఒక్క రాత్రి శివ నామస్మరణ చేస్తే చాలా పుణ్యం వస్తుందని బలంగా నమ్ముతారు హిందువులు. ఒక్క రాత్రి జాగరణ వల్ల ఎంతో మేలు జరుగుతుందని శివుడిని శివరాత్రి రోజు పవిత్రంగా పూజిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: