శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శు ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు.


దీనికి నిష్టా నియమం కావాలి. 


👉ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి ఒళ్ళంతా మర్ధన చేసుకుని నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. 


👉ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. 


👉 ఈ  రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. 


👉 వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. 


 👉 వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. 


 👉అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. ఎవరితోను వాదనలకు దిగరాదు.


👉 ఈ రోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. 


మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి. 


కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.


👉అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. 


👉తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి.


👉అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని, మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. 
ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను, భవ బంధాలను మరువరాదు.


ఈ విధంగా వ్యవహరించ గలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: