రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.  అయితే ముస్లింలు చాంద్రమాన కేలండర్‌ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లాం కేలండర్‌ తొమ్మిదో నెల 'రంజాన్'. రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముస్లిం దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువికి వచ్చిందని ముస్లింలు బలంగా నమ్ముతారు. మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అల్లా ప్రసాదించిన అద్భుత అవకాశం రంజాన్ మాసమని ముస్లింలు భావిస్తారు.


రంజాన్ నెలలో ముస్లింలు సోదరులు రోజా (ఉపవాసం) పాటిస్తారు. ఇక, ఈ ఏడాది పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. సోమవారం రాత్రి 7 గంటలకు ఆకాశంలో నెలవంక కన్పించిందని చార్మినార్‌ పరిసర మసీదుల నుంచి సైరన్‌ మోతలు విన్పించాయి. రూహిత్‌హిలాల్‌ కమిటీ ప్రతినిధులు సైతం నెలవంక దర్శనమిచ్చిందని సమాచారం అందించారు.


దీంతో ముస్లింలు చాంద్‌ ముబారక్‌ తెలుపుకొన్నారు.  మంగళవారం నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. మక్కామసీదులో సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు తరావీహ్‌ నమాజ్‌ నిర్వహించారు.రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని మే 7 నుంచి జూన్ 4 వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: