Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 6:28 am IST

Menu &Sections

Search

తిరుమల శ్రీవారి కానుకలు ఎంతలా పెరిగాయో తెలుసా ?

తిరుమల శ్రీవారి కానుకలు ఎంతలా పెరిగాయో తెలుసా ?
తిరుమల శ్రీవారి కానుకలు ఎంతలా పెరిగాయో తెలుసా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తిరుమలలో శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఏటికేడాది పెరుగుతున్నాయి. బంగారం... వెండి కానుకలతో రికార్డుల మోత మోగుతోంది. గత ఐదు నెలల కాలంలోనే శ్రీనివాసుడికి కళ్లు చెదిరిపోయేలా కానుకలు వచ్చాయి. భక్తుల కొంగు బంగారమైన శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో కానుకలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయ్. 


కలియుగ వైకుంఠం తిరుమలలో వెంకటేశ్వరస్వామికి భారీగా కానుకలు వస్తున్నాయి. ఆపద మొక్కుల వాడికి పెద్దమొత్తంలో కానుకలు సమర్పిస్తున్నారు భక్తులు. తిరుమలలో శ్రీనివాసుడిని దర్శించుకొని తమ కోరికలు తీర్చమని భక్తులు వేడుకుంటారు. ఇక... కోరికలు తీరిన తర్వాత...స్వామి వారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు క్యూకడుతున్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గతంలో స్వామివారి దర్శనానికి సాధారణ రోజుల్లో 25 వేల మంది వస్తుండేవారు. అదే సెలవు రోజుల్లో ఆ సంఖ్య 50 వేలకు మించేదికాదు. కానీ ఇప్పుడు సాధారణ రోజుల్లోనే 65 వేల మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. సెలవు రోజుల్లోనైతే ఏకంగా లక్ష మందికి తగ్గకుండా తిరుమలకు వస్తున్నారు. దీంతో శ్రీవారికి లభించే కానుకలు కూడా భక్తుల సంఖ్యను బట్టే  పెరుగుతున్నాయి. 


20ఏళ్ల కిందటి వరకు శ్రీవారికి ఏడాదికి లభించే హుండీ ఆదాయం 100కోట్లు మాత్రమే ఉండేది. అది ఇప్పుడు ఏకంగా వేల కోట్లకు చేరుకుంది. ఏడాదికి ఏకంగా 1300 కోట్లకు చేరింది. ఒక్క ఏడాదిలోనే బంగారం వెయ్యి కేజీలు, 8 వేల కేజీల వెండిని భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. కలియుగ వైకుంఠనాథుడి ప్రాశస్త్యం దశదిశలా వ్యాపిస్తోంది. శ్రీవారి వైభవం అంతే స్థాయిలో పెరుగుతూ వస్తోంది అంటున్నారు ప్రధాన అర్చకులు.


ఇక శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 5 నెలల్లోనే కానుకలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు 114 కోట్ల విరాళాలు సమకూరాయి. ఈ ఏడాది ఇప్పటికే 140 కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా అన్నప్రసాద పథకానికి 65 కోట్లు... బాలాజీ ఆరోగ్య వరప్రసాదానికి 23.70 కోట్లు, ప్రాణదానానికి 10.4 కోట్ల ఆదాయం విరాళాల రూపంలో అందించారు భక్తులు. గత ఏడాది 5 నెలల కాలంలోనే 1128 కేజీల వెండి హుండీ ద్వారా లభించింది. ఈ ఏడాది  రికార్డు స్థాయిలో 3098 కేజీల వెండిని సమర్పించారు భక్తులు. అత్యధికంగా మే మాసంలో 1267 కేజీల వెండిని సమర్పించారు. ఇక 5 నెలల కాలంలోనే 344 కేజీల బంగారాన్ని సమర్పించారు భక్తులు. ఈ ఏడాది ఇదే కాలంలో 524 కేజీల బంగారాన్ని సమర్పించారు. మరోవైపు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 450.54 కోట్ల రూపాయల హుండి ఆదాయం శ్రీవారికి లభించింది. ఈ ఏడాది ఇదే కాలంలో 497.29 కోట్ల ఆదాయం స్వామి వారి సొంతమైంది. ఇలా గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతున్నాయి. శ్రీవారి వైభవం దశదిశలా వ్యాపిస్తోందని చెప్పటానికి వచ్చే కానుకలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

Do you know how much Thirumala Srivari's gifts have grown?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ట్వీట్ కలకలం
రెండు రాష్ట్రాల్లో గెలుపుపై బీజేపీకి ఎందుకంత ధీమా?
బెజవాడకు పాకిన డ్రగ్స్ కల్చర్.. విచారణలో సంచలన విషయాలు..!
సీఎం జగన్ పై నారా లోకేశ్ సెటైర్లు..!
మహానగరంలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌
కొరటాల.. చిరంజీవితో తీసే సినిమా కాన్సెప్ట్ అదేనట!
రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మారుస్తారట!
హుజూర్ నగర్ లో ఉపఎన్నికలో ఏ నినాదం గెలుస్తుంది..?
టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ.!
హుజూర్ నగర్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ
ప్రతీ ఇంటి గడప తొక్కుతున్న ఎమ్.ఐ.ఎమ్ అధినేత
తెలంగాణ గవర్నర్ ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు?
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అలజడి !
ఆశ్చర్యం.. ! రాయల్ ఎన్ ఫీల్డ్ పై ముఖ్యమంత్రి 122కి.మీ ఒంటరి ప్రయాణం
జపాన్ లో వరద విలయం.. 70మందికి పైగా మృతి
భారతరత్న సిఫారసు ప్రకటన అగ్గిరాజేస్తుందే !
అవిభక్త కవలలు వీణా-వాణీలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఆర్థిక సంక్షోభ అంచున దాయాది దేశం
ఎవరూ ఊహించలేని విధంగా జగన్ కొత్త నిర్ణయం!
నర్సుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చిన కొత్త నిబంధన !
ఏపీ మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలు ఇవే!
వివేకా హత్య కేసులో పుకార్లు సృష్టిస్తే.. ఖబడ్డార్
కశ్మీరీలకు పెద్ద షాక్ ఇచ్చిన మొబైల్ ఆపరేటర్లు !
సూపర్ ఓవర్ వివాదానికి చెక్ పెట్టిన ఐసీసీ
సరిహద్దుల్లో మాటేసిన 50 మంది టెర్రరిస్టులు!
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో..!
ఆర్థిక మంత్రి భర్త ఇలా అంటున్నారేంటి?
భారత సంతతి ఆర్థిక వేత్త అభిజిత్ కు నోబెల్
అజిత్ ధోవల్ బలమైన సాక్ష్యాలు కావాలట !
అయోధ్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు !
ఎయిరిండియాలో డేంజర్‌ బెల్స్‌
హగిబిస్ దెబ్బకు జపాన్ రూపురేఖలు లేకుండా పోయింది..!
ప్లాస్టిక్ సర్జరీ ముఖంతో ఇళ్లలోకి దూరి...!
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ, రాహుల్ సవాళ్లు
వంటావార్పుతో ఆర్టీసీ కార్మికుల నిరసన
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కర్తాపూర్ కారిడార్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.