ఫీల్డ్ లో దూకుడుగా ఆడే ఆటగాళ్లు బయట కూడా అంతే దూకుడు తనం ఉంటారనుకుంటాం కాని ఇది విరాట్ కొహ్లి దానికి వ్యతిరేకం అని చూపించాడు. అమెరికాలో వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ లో తనను కలవడానికి ఓ 90 ఏళ్ల వృద్ధురాలు రాగా తన జెర్సీని కానుకగా ఇచ్చి ఆమెను ఆనందపరిచాడు విరాట్ కొహ్లి. కేవలం ఆటలోనే పర్ఫెక్ట్ కాదు అన్ని విషయాల్లో ముఖ్యంగా ఫ్యాన్స్ ను సంబర పరచడంలో కొహ్లి వారెవా అనిపించేశాడు.

 

ఇక అభిమానులు తమతో ఫోటో దిగాలని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే తాము ఏమాత్రం విసుగు చెందకుండా ఉండటం గొప్ప విషయమే. కొహ్లి ఇచ్చిన ఆ జెర్సీతో ఆ 90 ఏళ్ల అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయింది. అభిమానుల ముఖం మీద చిరునవ్వు చూసేందుకు విరాట్ ఇలాంటి వాటిలో ఇంకాస్త చురుకుగా ఉండటం మంచి విషయమే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: