పాండ్యా బ్రదర్స్ భారత్ లో క్రికెట్ ను అనుసరించేవాళ్ళందరికి సుపరిచితమైన పేరు.గల్లీ క్రికెట్ ఆడటం నుండి మొదలైన వీరిరువురి ఆట ఇపుడు జాతీయ,అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇద్దరూ ఐపీఎల్ లో ముంబైఇండియన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు .గత రెండు ఐపీఎల్ సీజన్ల నుండి అందివచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని  పొట్టి ఫార్మాట్ లో తనదైన ముద్రను వేసారు .తమ్ముడు హార్దిక్ పాం డ్యా 2016 T20 వరల్డ్ కప్ లో అద్భుతప్రదర్శన కనపరిచి భారత జాతీయజట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేస్కున్నాడు ,ఇక అన్న కృనాల్ పాండ్యా జాతీయ జట్టులో రావడానికి తీవ్ర కృషి చేస్తున్నాడు  అయితే ఈ నెల 27 న ముంబైలో కృనాల్ పాండ్యా వివాహం ఘనంగా జరిగింది .


తన చిరకాల మిత్రురాలు పాంఖురి శర్మ ను తన బంధువులు ,మిత్రులు సమక్షంలో వివాహమాడాడు.అయితే 26న జరిగిన మెహిందీ ఫంక్షన్  లో అంతా తమ్ముడు హార్దిక్ పాండ్యా హవానే నడిచింది .బాలీవుడ్ పాటలకు అన్న కృనాల్ తో స్టెప్పులు వేస్తూ మొత్తం కార్యక్రమాన్ని హోరేత్తించాడు ,అందుకు సంబందించిన వీడియోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తునాయి.కామెంట్లు ,లైకులు ,షేర్లతో ఇంటర్నెట్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.


కేవలం క్రికెట్ లోనే కాదు నువ్వు ఇలాకుడా మమ్మల్ని ఆనందిచగలవు అని అభిమానులు చమత్కరిస్తున్నారు .  ఈ నెల 27 న ఉదయం జరిగిన పెళ్ళి అత్యంత సన్నిహితులు ,బంధువుల మధ్య జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు .కాగా బుధవారం సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్  కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .


బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ,రిలయన్స్ అధినేత ముఖేష్అంబానీతో పాటు ఆయన సతీమణి ముంబైఇండియన్స్ ప్రాంచైస్ యజమాని నీతూఅంబానీ కూడా హాజరయ్యారు.వీరితో పాటు వర్ధమాన క్రికెట్ క్రీడాకారులు రోహిత్ శర్మ ,శ్రేయాస్ అయ్యర్ , చాహల్ ,అక్షర్ పటేల్ ,కే యల్ రాహుల్ తదితరులు హాజరయ్యి వధూవరులకు శుబాకాంక్షలు ,ఆశీష్షులు అందజేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: