ఆడమ్ గిల్ క్రిస్ట్. ఆస్ట్రేలియా క్రికెట్ కి సేవలందించి ప్రస్తుతం రిటైర్ అయిన ఈ ఆటగాడు, తాను క్రికెట్ ఆడేటపుడు తనని భయపెట్టిన బౌలర్ గురించి చెప్పుకొచ్చాడు. గిల్ క్రిస్ట్ వికెట్ల వెనకాల ఎంత చురుగ్గా ఉంటాడో, వికెట్ల ముందు కూడా అంతే చురుకుగా ఉంటాడు. హేడెన్ మరియు గిల్ క్రిస్ట్ కలిసి ఓపెనర్ గా వచ్చారంటే వాళ్ళ భాగస్వామ్యాన్ని విడగొట్టాలంటే ఎంత కష్టం అవుతుండొ ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అయిన గిల్ క్రిస్ట్ బ్యాటీంగ్ మెరుపులు మెరిపించేవాడు. 


అలాంటి గిల్ క్రిస్ట్ కి మన భారత బౌలింగ్ కర్మలా వెంటాడిందట. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ బౌలింగ్ తనని కర్మలా వెంటాడిందని చెప్పుకొచ్చాడు. ఎలాంటి బౌలింగ్ అయినా తుత్తునియలు చేసే గిల్ క్రిస్ట్ హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరణ్ లు ఇబ్బంది పెట్టేవారట. ముఖ్యంగా భజ్జీ తనను వెంటాడుతూనే ఉన్నాడని అన్నాడు. 2001 లో ఆస్ట్రేలియా 16 టెస్ట్ మ్యాచులు గెలిచి రికార్డు సాధించాలని అనుకున్నాం కానీ మా ప్రయత్నానికి భారత్ అడ్డుకట్ట వేసింది. 


ఆ సిరీస్ తొలి మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్, తర్వాతి మ్యాచుల్లో బజ్జీ బౌలింగ్ కి కుదేలై సిరీస్ చేజార్చుకుంది. మొత్తం మూడు మ్యాచుల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గిల్ క్రిస్ట్ 80 బంతుల్లో 100 చేసాడు. కేవలం మూడు రోజుల్లోనే ఆ మ్యాచ్ గెలిచింది ఆసీస్. కానీ తర్వాతి రెండు మ్యాచుల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్జీ బౌలింగ్ ధాటికి ఆసీస్ కకావికలం అయింది. దాంతో బజ్జీ అంటే ఆస్ట్రేలియాకి భయం ఏర్పడింది. అప్పటి నుండి బజ్జీ తనని కర్మలా వెంటాడని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: