కోల్ కతా వేదికగా ఈడెన్  గార్డెన్స్ బంగ్లాదేశ్ తో  పింక్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.భారత్ ఆడుతున్న మొదటి పింక్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ కి ముందు మన ఆటగాళ్ళు పింక్ బాల్ తో ప్రాక్టిస్ చేశారు. ఈ  మ్యాచ్ లో  భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేష్ నూట ఆరు పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ  మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటికే బ్యాటింగ్ లో తనదైన శైలిలోదూసుకుపోతూ రికార్డులని  తన ఖాతాలో వేసుకుంటున్న కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టాడు. 

 

ఈ  మ్యాచ్ కి ముందు కోహ్లీ  కెప్టెన్ గా  పరుగులు చేసాడు. శుక్రవారం జరిగిన ఇన్నింగ్సులో మిగతా  పరుగులు పూర్తి చేయడంవల్ల అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 5000 పరుగులు పూర్తీ చేసిన కెప్టెన్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఐసిసి కెప్టెన్ రికీపాంటింగ్ పేరు మీద ఉండేది. రికీపాంటింగ్ 97 ఇన్నింగ్సుల్లో 5000 పరుగులు పూర్తీ చేస్తే కోహ్లీ 86 వ ఇన్నింగ్స్ లో ఆ ఘనతని చేరుకున్నాడు. మొత్తంగా కోహ్లీ 141 ఇన్నింగ్సులు అడగా కెప్టెన్ గా ఈరోజు 86 వ ఇన్నింగ్సు  ఆడాడు. 

 

అతి తక్కువ ఇన్నింగ్సుల్లో కెప్టెన్ గా 5000 పరుగులు పూర్తీ చేసిన ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా 5000 పరుగులు పూర్తీ చేసిన మొదటి టీమిండియా ఆటగాడిగా గుర్తింపు పొందాడు.  అయితే కెప్టెన్ గా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఆరవ స్థానంలోఉన్నాడు. మొదటి నుండి ఐదు స్థానాల్లో ఉన్న వారిలో రికీ పాంటింగ్‌( ఆస్ట్రేలియా-97 ఇన్నింగ్స్‌లు), క్లైవ్‌ లాయిడ్‌(వెస్టిండీస్‌-106 ఇన్నింగ్స్‌లు),గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా-110 ఇన్నింగ్స్‌లు), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా-116 ఇన్నింగ్స్‌లు), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌( న్యూజిలాండ్‌-130 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు. ప్రస్తుతం మొదటి స్థానాన్ని కోహ్లీ ఆక్రమించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: