విశాఖపట్టణం వేదికగా భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే లో టాస్ గెలిచి వెస్టిండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా భారత ఓపెనర్లు విశాఖ వేదికగా చెలరేగి పోతు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇద్దరూ ఓపెనర్లు చెలరేగిపోయారు. ఓపెనింగ్ కి దిగిన ఇద్దరు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ సెంచరీలు కొట్టడంతో భారత్ స్కోర్ 40 ఓవర్లు దగ్గరకొచ్చేసరికి 200 పరుగులు పైగానే దాటింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే చర్చల మీద చర్చలు కొడుతూ విండీస్ బౌలర్లకు చుక్కలు తలపోటుగా మారడు. విశాఖపట్టణం వాసులు రోహిత్ శర్మ బ్యాటింగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. గ్రౌండ్ మొత్తం  సందడి సందడి వాతావరణం నెలకొంది.

 

ప్రస్తుతం రోహిత్ శర్మ 150 పరుగుల దగ్గరలో ఉన్నాడు. రెండు వికెట్లు కోల్పోయి భారత్ స్కోరు ప్రస్తుతం 300 పరుగుల దగ్గరలో ఉంది. పైగా వైజాగ్ రోహిత్ శర్మ అమ్మమ్మ ఊరు అవటంతో వైజాగ్ వాసులు రోహిత్ శర్మ పేరుతో నినాదాలు చేస్తూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వెస్టిండీస్ బౌలర్ భారత బ్యాట్స్మెన్ లకు దాసోహం అయిపోయినట్టుగా బౌలింగ్ వేయలేక వారిని ఇబ్బందులకు గురి చేయలేక వేసిన ప్రతి బంతి భారత బ్యాట్స్మెన్లు పెవిలియన్ కి పంపించడంతో వికెట్ తీయడానికి నానా తంటాలు పడుతూ లబోదిబోమంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే రెండో వన్డేలో విశాఖ వేదికగా భారత్ భారీ స్కోరు దిశగా కొనసాగుతుంది.

 

అంచనాలు బట్టి ప్రస్తుత స్కోరు బట్టి చూస్తుంటే 300 పరుగులకు పైగానే భారత్ టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ గ్యారెంటీగా భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ట్రాక్ రికార్డ్ చెబుతున్నాయి. విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన తొమ్మిది వన్డేల్లో ఆరింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడింది. మొత్తంమీద ప్రస్తుత స్కోర్ 292 అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో చితక్కొట్టి చివరాఖరికి 159 పరుగులకు అవుటయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: