విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో నేడు వెస్టిండీస్ ఇండియా మధ్య  రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదటి  వన్డే మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న కరేబియన్ జట్టు... మరో మ్యాచ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉంది. మరోవైపు టీమిండియా జట్టు కూడా రెండో వన్డే మ్యాచ్ విజయం సాధించి సిరీస్ పై ఆశలు సజీవం చేసుకునేందుకు పట్టుదలతో మైదానంలోకి దిగింది. ఈ నేపథ్యంలో అటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.కాగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ మొదట బ్యాటింగ్ దిగింది. అయితే బ్యాటింగ్  మైదానంలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కరేబియన్ బౌలర్లు  వేసిన బంతిని భూమి మీద కాకుండా మొత్తంగా గాల్లోనే ఉంచేసారు అని చెప్పాలి. 

 

 

 

 ప్రస్తుతం రెండో వన్డేలో  సెకండ్ ఇన్నింగ్స్ జరుగుతుండగా భారత బౌలర్లందరూ  కరేబియన్ ఆటగాళ్లను కట్టడి చేస్తున్నారు . ఇదిలా ఉంటే భారత మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ భారత్ వెస్టిండీస్ వన్డే లో అరుదైన రికార్డు సాధించాడు. ముప్పై మూడు ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఏకంగా  తన మణికట్టు తో మాయ చేసేసాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా సరికొత్త  రికార్డు సృష్టించాడు కుల్దీప్ యాదవ్. 

 

 

 

 33 ఓవర్ లో  నాలుగో బంతికి కరేబియన్ బ్యాట్స్మెన్ హోప్  అవుటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకొని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ హోప్ ను  అవుట్ చేశాడు. ఇక 5 బంతికి హోల్లార్డ్  అవుటయ్యాడు. హోలార్డ్  ఇచ్చిన క్యాచ్ ను  కీపర్ క్యాచ్ అందుకున్నాడు. చివరి బాల్  జోసఫ్ బ్యాట్  చివర్లో తగిలి స్లీప్ లో ఉన్న జాదవ్ చేతిలో పడింది. దీంతో వరుసగా మూడు వికెట్లు తీసి హాట్రిక్  సాధించాడు కులదీప్ యాదవ్. అయితే ఇప్పటి వరకు రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక భారత బౌలర్ గా  కులదీప్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇకపోతే భారత బౌలర్లు అందరూ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కు పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ వెస్టిండీస్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: