భారత్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునే లీగ్ ఐపీఎల్. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను తమ జట్టు లో కి తీసుకోవడానికి వేలం మొదలుపెట్టాయి. కోల్‌కతా వేదికగా ఈ వేలం మొదలుకానుంది. గురువారం మొదలు కానున్న వేలానికి దాదాపు ప్రపంచం మొత్తం నుండి 332 మంది ఆటగాళ్లు వస్తున్నట్లు సమాచారం. ఎనిమిది జట్టులో 72 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో రాబోయే సంవత్సరం టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా జరగబోయే ఐపీఎల్ కోసం చాలా మంది యువ ఆటగాళ్లు తమకి జట్లలో గ్యారెంటీగా ప్లేస్ దొరుకుతుందన్న ఆశాభావంతో ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

ముఖ్యంగా లీగ్‌లో వేలానికి రానున్న వారిలో పిన్న వయస్కుడైన అప్ఘానిస్థాన్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (14) హాట్‌కేక్‌గా అమ్ముడయ్యే అవకాశం ఉంది. నూర్‌ కనీస ధర రూ. 30 లక్షలు. ఇతగాడు లెఫ్టామ్‌ చైనామన్‌ స్పిన్నర్‌. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) కూడా ఆశగా ఎదురుచూస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ లో విదేశీ క్రికెటర్ల వైపు ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు కొనుక్కోడానికి ఎంత మొత్తమైనా చెల్లించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

ఎక్కువగా  విదేశీ క్రికెటర్లలో సూపర్ హిట్టర్లు గ్లేన్ మాక్స్ వెల్, షిమ్రోన్ హెట్ మేయర్, జేసన్ రాయ్, క్రిస్ లిన్, సామ్ కరెన్, డేవిడ్ మిల్లర్ ల వైపు ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చివేయగల ఆరుగులు ప్రధాన క్రికెటర్ల వైపే వివిధ ఫ్రాంచైజీలు గురిపెట్టాయి. ఎంత ధరకైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్ వేలం చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధికంగా 14 కో్ట్ల 50 లక్షల రూపాయల ధర దక్కించుకొన్న రికార్డు ఇంగ్లండ్ సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పేరుతో ఉంది. మరి తాజాగా జరగబోయే వేలంలో ఏ ఆటగాడు ఎక్కువ రేటు పలుకుతారో అన్న ఉత్కంఠత క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: