ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టు వెచ్చించనంత భారీ మొత్తం బిసిసిఐ భారత దేశంలోని యువ ఆటగాళ్లపై పెడుతుంది అన్నది వాస్తవం. టెస్టు, వన్డే టి20 అని తేడా లేకుండా అనేకానేక టోర్నీలు నిర్వహించి, కోట్లకు కోట్లు వెచ్చించి, యువతలో ఉన్న టాలెంట్ ను బయటికి వెలికి తీసే పనిలో ఉంటారు. అలా బయట పడిన వారంతా తమను తామ నిరూపించుకోవడానికి ఉన్న అతిపెద్ద ప్లాట్ ఫార్మ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్.

 

ఇప్పుడు భారత జట్టులో కీలక స్థానాల్లో ఉన్న పృథ్వి షా, శ్రేయస్ అయ్యర్, జస్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటివారు అంతా అలా దేశవాళి క్రికెట్ నుండి ఐపీఎల్ లోకి అడుగుపెట్టి తమను తాము నిరూపించుకున్న వారే. అయితే ఇదే విధంగా ఈ సంవత్సరం వేలంలో బయటపడ్డ కొంతమంది భారత యువ కెరటాలు ఎవరంటే..

 

యశస్వీ జైస్వాల్ మరో సంచలనం సృష్టించాడు. 17ఏళ్ల ఈ క్రికెటర్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడి రూ.2.40కోట్లకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన ఈ కుర్రాడు ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించాడు. స్పిన్నర్ వరణ్ చక్రవర్తిని రూ.4 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. టీమిండియా ఆండర్ -19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.90 కోట్లకు దక్కించుకుంది. ప్రియమ్ గార్గ్ కోసం సన్‌రైజర్స్ తో క్రింగ్స్ ఎలెవన్ తీవ్రంగా పోటీపడింది. ఎట్టకేలకు ప్రియమ్ గార్గ్‌ను రూ.1.90 సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

 

జార్ఖండ్ యువ ఆటగాడు విరాట్ సింగ్‌ను సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.90 కోట్లకు కోనుగోలు చేసింది. రాహుల్ త్రిపాఠిని కో‌ల్‌కతా రూ.60 లక్షలకు దక్కించుకుంది. టీమిండియా మరో యువ ఆటగాడు దీపక్ హుడాను రూ. 50లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది. వికెట్ కీపర్ అనుజ్ రావత్‌ను 80లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: