ఇండియాలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతో మంది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఆటగాళ్ల కంటే అభిమానులు ఉత్కంఠగా ఉంటారు. భారత ఆటగాళ్లు సిక్స్ కొడితే సంబర పడి పోవడం .  వికెట్ పోతే బాధ పడిపోవడం  ప్రేక్షకులు చేస్తూ ఉంటారు. ఇక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లైతే అబ్బో కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు సగటు ప్రేక్షకుడు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ సందడి డబుల్ అయిపోతుంది. 

 


 మామూలుగా క్రికెట్ మ్యాచ్ వస్తుందంటేనే  టీవీలకు అతుక్కుపోయే  ప్రేక్షకులు... ఐపీఎల్ మ్యాచ్ వస్తుందంటే కొన్ని గంటల ముందు నుంచి ఐపీఎల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ టీవీల ముందు కూర్చుంటారు . ఐపీఎల్లో ప్రాంతాల వారీగా టీమ్లు ఉండటంతో.. సగటు క్రికెట్ ప్రేక్షకుడికి ఐపీఎల్ పై మరింత ఆసక్తి పెరిగి పోతూ ఉంటుంది. తమ అభిమాన టీమ్  గెలవాలని టీవీ ముందు ఉన్న అభిమానులు అందరూ కోరుకుంటూ ఉంటారు. దానికి  తోడు విదేశీ ఆటగాళ్లు కూడా మన ఆటగాళ్లతో కలిసి ఆడడం కూడా  క్రికెట్ ప్రేక్షకులు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.ఇకపోతే  ఐపీఎల్ మ్యాచ్ కోసం ఇప్పటికే అంతా సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 అయితే ఐపీఎల్ ఫైనల్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలో జరిపేందుకు బిసిసిఐ సన్నాహాలు చేస్తుందట. గుజరాత్లోని  మొతేరా  స్టేడియం ఇంకొన్ని రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్ స్టేడియంగా  రికార్డుకెక్కనుంది . ఈ స్టేడియంలో మ్యాచ్ జరిగితే పూర్తి సామర్థ్యం మేరకు స్టేడియం మొత్తం నిండితే 1,10000 ప్రేక్షకులు మ్యాచ్ ను  వీక్షించడానికి వీలు ఉంటుందట . నిజానికి మొతేరా  స్టేడియం  ప్రపంచంలోని పురాతన స్టేడియంలో ఒకటి. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్టేడియాన్ని నిర్మించాలని ఆలోచనతో.. పురాతనమైన స్టేడియాన్ని కూల్చేసి కొత్త స్టేడియం నిర్మించారు. మార్చిలో భారత్ వరల్డ్ లెవన్ మధ్య  జరిగే మ్యాచ్ ద్వారా ఈ స్టేడియం ప్రారంభమవుతుంది. ఇకపోతే ఈ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరిగితే... ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్ గా  ఐపీఎల్ రికార్డు సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: