ఈ ఆటగాడు  బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు  అంటే బౌలర్లకు దబిడి దిబిడే... ఇక ఆయన బ్యాట్ జుళిపిస్తే బాల్  మొత్తం గాల్లోనే తేలియాడుతూ వుంటుంది... డబుల్ సెంచరీలు చేయడంలో ఆయన దిట్ట... అలవోకగా సెంచరీలు చేయడం ఆయన నైజం... ఆటగాడి టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఓవైపు వైస్ కెప్టెన్ గా  జట్టును ముందుకు తీసుకెల్తూనే  మరోవైపు... తన బ్యాట్ తో  ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు  ఈ ఆటగాడు. ఎన్నోసార్లు మైదానంలోకి అడుగు పెట్టి పరుగుల వరద పారించి  టీమిండియాకు విజయాన్ని సొంతం చేసిన గొప్ప ఆటగాడు రోహిత్ శర్మ. ఫార్మెట్ ఏదైనా బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారావాల్సిందే  అన్నట్లుగా ఉంటుంది రోహిత్ శర్మ ఆట. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే  సొగసైన సిక్సర్లతో అభిమానులను అలరిస్తు  భారీ స్కోర్లు నమోదు చేస్తూ ఉంటాడు. 

 

 

 

 ఎలాంటి ఒత్తిడి ఉన్న సమయంలో నైనా అద్భుత ప్రదర్శన చేస్తూ అరుదైన రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇక ఈ ఏడు రోహిత్ శర్మ పరుగుల వేట భారీగానే  ఎక్కువగా సాగిందనే చెప్పాలి. ఈసారి రోహిత్ పరుగుల వేట ముందు ఏ ఆటగాడు కూడా పని చేయలేక పోయాడు. పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. అదిరిపోయే బ్యాటింగ్తో క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతో అలరించాడు. టీమ్ ఇండియా జట్టు కు ఎన్నో విజయాలను అందించాడు. అయితే 2019 లో రోహిత్ శర్మ  టాప్ ప్లేస్ లో ఉన్నాడు అని చెప్పాలి. 2019 సంవత్సరం రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. 

 

 

 

 క్రికెట్లో ఈ ఏడాది డబుల్ సెంచరీలు దీరుడు రోహిత్ శర్మ హిట్  అయ్యాడు. 2019 సంవత్సరంలో కొన్ని అరుదైన రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ గా  22 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టి తన పేరును లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఏకంగా ఓపెనర్గా అన్ని ఫార్మాట్లలో కలిపి 2442 పరుగులు చేశాడు. అంతేకాకుండా 2019 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. వన్డేల్లో మొత్తంగా 1490 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్లో 10 సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: