ఇండియాలో క్రికెట్ కు  భారీ రేంజ్ లో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏ ఆటకు లేనంత క్రేజ్ ఒక క్రికెట్ కు మాత్రమే సొంతం. క్రికెట్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతో మంది. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్  వీక్షిస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక తమ అభిమాన హీరో ఒక రేంజ్లో ఆడుతుంటే టీవీల ముందు కూర్చొని గంతులేస్తూ మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎలాంటి పరుగులు చేయకుండా పెవిలియన్ చేరితే ఆటగాళ్ల కంటే ఎక్కువగా టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులే బాధపడుతూ ఉంటారు. సిక్స్  కొట్టు... ఫోర్  కొట్టు అంటూ టీవీల ముందు కూర్చుని మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ ఉంటారు చాలామంది క్రికెట్ ప్రేక్షకులు. 

 

 

 

 మిగతా ఛానళ్లలో ఎలాంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ సినిమాలు వస్తున్నా సరే.. మ్యాచ్  వస్తుందంటే తప్పక  ఛానల్ మారాల్సిందే. అంతలా భారతదేశంలో ప్రజలందరిని క్రికెట్ ఆట ప్రభావితం చేసింది. ఇక క్రికెట్ ఆటగాళ్లపై ప్రేక్షకులందరూ ఎంతో అభిమానాన్ని పెంచుకుంటారు. ఒక్కసారైనా తమ అభిమాన ఆటగాన్ని  కలిస్తే చాలు జన్మ ధన్యం అయిపోయినట్టే అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సెక్యూరిటీ నుంచి తప్పించుకుని మరీ  మైదానంలోకి వచ్చి తమ అభిమాన ఆటగాళ్లను కలుస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం చూడనివి కాదు. ఇకపోతే మనదేశంలో క్రికెట్ తర్వాతే ఏదైనా అని మరోసారి నిరూపితమైంది. 

 

 

 భారత ప్రజలందరూ క్రికెట్ను ఎంతగా అభిమానిస్తారో మరోసారి తేలిపోయింది. ఇండియా లో భారీ రేంజ్ లో ఉండే క్రికెట్ ఫీవర్ మరోసారి 2019లో రుజువైంది. సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన అంశాల్లో వరల్డ్ కప్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా 2019 సంవత్సరంలో ఎక్కువగా వెతికిన అంశాల్లో వరల్డ్ కప్ మొదటి స్థానంలో నిలవగా.. లోక్సభ ఎన్నికలకు రెండవ స్థానం దక్కింది. ఆ తర్వాత వరుసగా చంద్రయాన్ 2, కబీర్సింగ్,  అవెంజర్, ఎండ్ గేమ్ఆర్టికల్ 370,  నీట్ రిజల్ట్స్,  జోకర్, కెప్టెన్ మార్వెల్,  పీఎం కిసాన్ యోజన గురించి ఎక్కువగా నెటిజన్లు ఆన్లైన్లో సెర్చ్  చేశారు. ఏది ఏమైనా మరోసారి క్రికెట్ కి భారత్ లో ఉన్న క్రేజ్  గురించి నిరూపణ అయినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: