చాలా సందర్భాలలో అంతర్జాతీయస్థాయిలో భారత క్రికెట్ జట్టు తరఫున బ్యాటింగ్ ఓపెనర్స్ కుప్పకూలిపోయిన సందర్భంలో భారత టీం కి ‘ది వాల్’ గా ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని భారత్ టీం ని ఆదుకున్న సందర్భాలు రాహుల్ ద్రావిడ్ కెరియర్లో చాలానే ఉన్నాయి. వన్డే మరియు టెస్ట్ అనే తేడా లేకుండా రాహుల్ ద్రావిడ్ కీలక సమయంలో ఇండియన్ టీం ని తన బ్యాటింగ్ తో ముందుండి నడిపించడం జరిగింది. 1996 నుండి భారత క్రికెట్ జట్టు తరపున ఆడిన రాహుల్ ద్రావిడ్ 2012వ సంవత్సరంలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

భారత టీం కి కెప్టెన్ గా కూడా రాణించడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జుట్టు లో విభేదాల వల్ల 2007వ సంవత్సరంలో నాయకత్వ బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్న రాహుల్ ద్రావిడ్..జట్టులో సభ్యుడిగా కీలక బ్యాట్స్ మెన్ గా రాణించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారి చేత ప్రపంచంలో 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు రాహుల్ ద్రావిడ్. అంతేకాకుండా భారత్ క్రికెట్ టీమ్ లో లెజెండ్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ మరియు సచిన్ టెండుల్కర్ తర్వాత భారత తరఫున క్రికెట్ లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడవవాడు గా రాహుల్ ద్రవిడ్ పేరు సంపాదించాడు.

 

అంతేకాకుండా భారత్ క్రికెట్ టీం తరుపున 10000 పరుగులు మైలురాయిని అందుకున్న బ్యాట్స్మెన్ గా రాహుల్ ద్రావిడ్ భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు దక్కించుకున్నాడు. మరియు అదే విధంగా 10 వేల పరుగులను వన్డేలోను మరియు టెస్టులలో రాణించిన ఆటగాడిగా ప్రపంచ మూడవ ఆటగాడిగా సచిన్ మరియు బ్రెయిన్ లారా తర్వాత తన పేరు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉండేలా హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ టీం కి సలహాదారుడిగా రాణిస్తున్నాడు. టోటల్ గా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కెరియర్ జర్నీ చూస్తే భారత్ క్రికెట్ కి ఒక ఎవరెస్ట్ గా తనని తాను ఆవిష్కరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: