క్రికెట్ లోకి ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కింది స్థాయి క్రికెట్ లో తమ అద్భుతమైన ప్రదర్శన తో  సత్తాచాటిన అందరి చూపులు ఆకర్షించి జట్టులో కష్టపడి చోటు సంపాదిస్తారు . కానీ అంతర్ జాతీయ జట్టులోకి వచ్చినాక మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకోలేక పేలవ ప్రదర్శన చేస్తూ జుట్టులో  ఎక్కువ కాలం మనుగడ సాధించ లేక పోతారు. ఇలా జట్టులోకి వచ్చి కేవలం కొంత కాలమే టీమ్ ఇండియా తరఫున ఆడిన ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు. అలాంటి ఆటగాళ్ళకు అప్పుడప్పుడు మ్యాచ్లలో ఛాన్స్ వస్తూ ఉంటుంది.. ఇంకా అలా ఛాన్స్  వచ్చినప్పుడు చాలా మంది ఆటగాళ్లు తమని తాము నిరూపించుకోవడం వల్ల జట్టులో తమ  స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంత మంది అదే ప్రదర్శనతో జట్టులో  స్థానం కోల్పోతున్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరచు కోలేక టీమిండియాకు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. 

 

 

 మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించాలని కుతూహలంతో ఎంతో కష్టపడుతూ ప్రయత్నాలు  చేస్తున్నప్పటికీ కొంతమందికి టీమిండియా జట్టులో స్థానం అందని ద్రాక్ష లాగే  మారిపోతుంది. దీంతో ఒకప్పుడు చెట్టు లోకి వచ్చి ఎన్నో మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు సైతం జట్టులో  స్థానాన్ని సంపాదించేందుకు  ఎన్నో తంటాలు పడుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లలో ఒకరు టీమిండియా ఆటగాడు సంజు శాంసన్. కింది స్థాయి క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేసే జట్టులో స్థానం సంపాదించినప్పటికీ   ఎక్కువ కాలం జట్టులో  ఆడలేకపోయాడు. ఒక్కటంటే ఒక్కటి వన్డే మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ పై సెలక్టర్లు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో 2015లో వన్డే మ్యాచ్ ఆడిన సంజు శాంసన్ ఇప్పటివరకు కూడా ఆడలేక  పోయాడు. 

 

 

 ఇక ఎట్టకేలకు సంజు  సాంసంగ్ టీమిండియా జట్టులో స్థానం సంపాదించాడు. దీంతో క్రికెటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2015 సంవత్సరంలో జింబాబ్వేతో చివరి 20 ఆడిన సంజు శాంసన్.. మళ్లీ నేటి మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టులోకి రి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు సంజూ శాంసన్. రి ఎంట్రీ కి  ముందు వరకు 73 టి20 మ్యాచ్ లను కోల్పోయాడు ఈ ఆటగాడు. భారత్ తరపున తొలి టీ-20 మ్యాచ్ కు రెండో టి20 మ్యాచ్ కు మధ్య నాలుగేళ్ల వ్యవధి వచ్చిన తొలి ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజు శాంసన్ తర్వాత ఉమేష్ యాదవ్ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: