క్రికెట్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ఆట లోకి ఎప్పటికీ కొత్త ఆటగాళ్ళు వస్తూనే ఉంటారు. తమ సత్తా చాటుతూనే  ఉంటారు. అయితే క్రికెట్ ఆటలో కి ఎంట్రీ  ఇచ్చే ప్రతి ఆటగానికి ఓ ఆటగాడు ఇన్స్పిరేషన్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే.ఓ ఆటగాడిని  ఇన్స్పిరేషన్ తో నే క్రికెట్ లోకి వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు వుంటారు చాలామంది ఆటగాళ్లు . ఈ క్రమంలోనే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో మంది ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది ఇండియా ఆటగాళ్లకే  కాదు ప్రస్తుతం ఓ ఆసీస్  ఆటగానికి కూడా ధోని ఇన్స్పిరేషన్ గా ఉన్నారు.ఆ  ఆటగాడు ఎవరు అంటే ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ. 

 

 

 ప్రస్తుతం టీమిండియా జట్టు తో మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ ఆడడానికి ఆస్ట్రేలియా జట్టు భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ కోసం ఇప్పటికే ముంబైలో మైదానంలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. అయితే ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. భారత జట్టు మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోని కి తాను  వీరాభిమానిని అని అలెక్స్ క్యారీ తెలిపారు. అతనిలాగే తాను మంచి ఫినిషర్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. గత ఏడాది టీమ్ ఇండియా తో ఆడిన వన్డే సిరీస్లో మహేంద్ర సింగ్ ధోనీ తో కలిసి ఆడడం తన అదృష్టం అని  చెప్పుకొచ్చాడు అలెక్స్ క్యారీ. 

 

 

 అయితే తాను ఎంతగానో అభిమానించే మహేంద్ర సింగ్ ధోనీతో మ్యాచ్ ఆడటం  తన అదృష్టమని పేర్కొన్నాడు. తనకు ధోని ఇన్స్పిరేషన్ గా  నిలుస్తాడని అలెక్స్ కారీ తెలిపారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ కు  ముందు భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా.. ఐదు వన్డేల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ను ఆస్ట్రేలియా 3-2 తేడాతో సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ నెల 14న టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుండగా... భారత జట్టులో ఈసారి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అభిమానించే మహేంద్రసింగ్ ధోని ఆడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: