క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న గొప్ప ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. మహేంద్రసింగ్ ధోని జట్టులో ఉన్నాడు అంటే జట్టుకు విజయం ఖాయమని క్రికెట్ ప్రేక్షకుల నమ్మకం. తనదైన వ్యూహాలతో ఎత్తులు పై ఎత్తులతో ఓడిపోయే మ్యాచ్ ను  కూడా గెలిపించగల సత్తా ధోని  సొంతం. ఎలాంటి మ్యాచ్  నైనా విజయతీరాలకు చేర్పించి గల నైపుణ్యం ధోని కే సాధ్యం. ఇప్పటివరకు ఏ టీమిండియా సారథికి  సాధ్యం కాని రెండు ప్రపంచ రికార్డులను కేవలం ధోని కే సాధ్యమైంది అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ కప్ లో భారత్ ఓటమి తర్వాత ఇప్పటివరకు క్రికెట్లో అడుగు పెట్టలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 

 

 

 వరల్డ్ కప్ తర్వాత అసలు క్రికెట్ వైపు చూడలేదు మహేంద్రసింగ్ ధోని. ధోని ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అని వార్తలు రావడమే కానీ ఇప్పటివరకు ధోని వీటిపై స్పందించిన దాఖలాలు మాత్రం లేవు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని వార్త హల్చల్ చేస్తోంది. అయితే తన రిటైర్మెంట్ పై స్పందించిన మహేంద్ర సింగ్ ధోనీ తనకు జనవరి వరకు ఎవరు ఏమి అడగొద్దు అంటూ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా జనవరి రానే వచ్చింది ఇప్పుడు మరోసారి ధోనీ రిటైర్మెంట్ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే తాజాగా బిసిసిఐ ప్రకటించిన గ్రేడ్ లలో  అసలు ధోని పేరు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సెలెక్టర్లకు చెప్పడం వల్లే ధోనీ పేరును గ్రేడ్లో నమోదు చేయలేదని క్రికెట్ ప్రేక్షకులు భావిస్తున్నారు. 

 

 

 ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ప్రస్థానం ముగిసింది అనుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు హర్భజన్ సింగ్. మహేంద్రసింగ్ ధోని గురించి నాకు బాగా తెలుసు... ఒకవేళ ఐపీఎల్లో ధోనీ బాగా రాణించినప్పటికీ  మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన మాత్రం లేదు అనుకుంటున్నా అంటూ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ తో సెమీఫైనల్స్ లో  మహేంద్ర సింగ్ ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాడు అంటూ ఓ మీడియాతో వెల్లడించారు హర్భజన్ సింగ్. ప్రస్తుతం ఈ మాజి  స్పిన్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: